టోక్యో : జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన తన అధికారిక నివాసంలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల వెకేషన్‌కు వెళ్లిన ప్రధాని ఇటీవలనే టోక్యో చేరుకున్నారు. శనివారం నుంచి ఆయన దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో ఆదివారం ఉదయం పీసీఆర్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. జపాన్‌లో జులై, ఆగస్టు నెలల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. అయితే మరణాలు చాలా తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచం లోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వార్షికంగా 2.2 శాతం వృద్ధి సాధించింది. జపాన్ ప్రధాని కిషిడా శుక్రవారం టునీషియాలో జరగనున్న టోక్యో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు ఆన్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్‌లో ఆన్‌లైన్ ద్వారా పాల్గొంటారు. ఆ తరువాత మధ్య ప్రాచ్యంలో పర్యటిస్తారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు కరోనా
- Advertisement -
- Advertisement -
- Advertisement -