లండన్: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కరోనా సాధారణ జలుబుగా మారి పోతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌కు చాలా కాలంగా అలవాటుపడి ఉండడం, వ్యాక్సిన్ల కారణంగా ప్రజల రోగ నిరోధక శక్తి పెరగడంతో సాధారణ జలుబుగా కరోనా మారి పోతుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జాన్‌టెల్ చెప్పారు. వైరస్ వల్ల బ్రిటన్ చాలా దారుణమైన పరిస్థితులు అనుభవించిందని, శీతాకాలం దాటితే పరిస్థితులు మెరుగవుతాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆరు నెలల కిందటి కంటే చాలా మెరుగ్గా ఉందని టెల్ వివరించారు. యూకెలో కొవిడ్ మరణాలు కూడా చాలావరకు వయసు మళ్లిన వారి లోనే సంభవిస్తున్నాయని, అవి కూడా పూర్తిగా కొవిడ్ కారణంగానే అని స్పష్టంగా చెప్పలేమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం యుకెలో కేసుల సంఖ్య ఎక్కువ గానే ఉన్నా ఇప్పటికే వైరస్ బారిన పడిన వాళ్లు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు హెర్డ్ ఇమ్యూనిటీ కి తోడ్పడతారని ఆయన చెప్పారు.
Corona to resemble common cold by coming year