కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈసారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యం లో ఇప్పుడు సినిమా కార్మికులకు వ్యా క్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన సినీ కార్మికులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యాక్సిన్ డ్రైవ్ సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ “కరోనా క్రైసిస్ ఛారిటి ఆధ్వర్యంలో సినిమా వర్కర్స్, 24 క్రాఫ్ట్ వారికి ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం చిరంజీవి చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఈ కార్యక్రమం విజయవంతం గా సాగుతోంది. ఇప్పటివరకు 4000 మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. సినిమా కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఫెడరేషన్ సభ్యులు, సినీ పాత్రికేయుులకు కూడా వ్యాక్సిన్ ఇస్తు న్నాం. అలాగే మిగతా సినిమా రంగానికి సంబంధం ఉన్న అందరూ దయచేసి వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు కు రావాలి. అప్పుడే షూటింగ్స్ తొందరగా ప్రారంభమవుతాయి”అని అన్నారు.