Friday, November 22, 2024

కరోనా టీకా సెంటర్లు పెంపు

- Advertisement -
- Advertisement -

Corona Vaccination Centers hike from tomorrow

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా టీకా త్వరగా పంపిణీ చేసేందుకు కేంద్రాలు పెంచుతున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. 60 కేంద్రాలు పెంచి వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడిస్తున్నారు. శనివారం టీకా ప్రారంభించడంతో తొలి రోజు హైదరాబాద్ జిల్లాలో 14, రంగారెడ్డి 09, మేడ్చల్ జిల్లాలో 10 కేంద్రాలు ప్రారంభించి ఆరోగ్య కార్యకర్తలతో పాటు, పారిశుద్ద కార్మికులకు 984మందికి టీకా పంపిణీ చేశారు. కానీ గ్రేటర్ అధికారులు వివరాల ప్రకారం లక్షమందికి వేయాలి. వీరందరికి త్వరగా టీకా వేయాలంటే కేంద్రాలు పెంచితే వేయవచ్చని అధికారులు చెబుతున్నారు. రోజుకు 30మంది నుంచి 100మంది వ్యాక్సిన్ తీసుకునేలా ఏర్పాటు చేశారు. కొవిన్ సాప్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో మాన్యువల్‌గా టీకా ఇస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్ మొదటి రోజు విజయవంతం కావడంతో నేటి నుంచి ఎక్కువ మందికి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా వైద్యశాఖ పేర్కొంది.

ఒక పద్దతి ప్రకారం టీకాలను ఇస్తున్నట్లు ఎక్కడ వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, కొవిషీల్డ్ వ్యాక్సిన్ వయల్‌లో పదిమందికి సరిపోయే డోసులు ఉంటాయని, ఒకసారి తెరిచిన తరువాత నాలుగు గంటల వ్యవధిలో ఇవ్వాల్సి ఉన్నందున మొత్తం 10మంది సిద్దంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుని ఒక డోసు కూడా అడ్డగోలుగా వినియోగించకుండా పూర్తిగా సద్వినియోగం చేస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. విలువైన వ్యాక్సిన్ వృథా కాకుండదనే ఉద్దేశంతో చాలా పకడ్బందీగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి హైదరాబాద్ జిల్లాలో 25, రంగారెడ్డి 15, మేడ్చల్‌లో 20 కేంద్రాల్లో హెల్త్, శానిటైషన్ సిబ్బందికి ఇస్తున్నట్లు జిల్లా అధికారులు వివరించారు. తొలి టీకా తీసుకున్న వారి ఆరోగ్య పరిస్దితిని పర్యవేక్షిస్తామని, వారి వివరాలు సాప్ట్‌వేర్‌లో ఉంచామని, వారికి ఏమైనా ఇబ్బందులు వస్తే 104కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.

మొదటి తీసుకున్న వారికి మళ్లీ 28 రోజుల తరువాత అదే కేంద్రంలో రెండో డోసు వేస్తామని, టీకా తీసుకున్న వారు రెండు రోజుల పాటు జాగ్రత్తలు పాటించాలన్నారు. 15 రోజుల తరువాత యాంటీబాడీస్ వస్తాయని అప్పటివరకు అల్కహాలు లాంటి వాటికి దూరంగా ఉండటంతో పాటు ముఖానికి మాస్కులు, భౌతికదూరం, శానిటైజర్ వినియోగించాలన్నారు. అదే విధంగా తొలి రోజు టీకా తీసుకున్న సిబ్బంది తాము ఆరోగ్యంగా ఉన్నామని, దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరంలేదని, పేరు నమోదు చేసుకున్న వారంతా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. టీకా ఇచ్చిన చోట ఎర్రబడిని కొద్ది సేపట్లోనే యదాస్దితికి వస్తుందని చెబుతున్నారు. వదంతులు నమ్మకుండా వైద్యాధికారుల సూచనలు పాటించి కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ముందడుగు వేయాలని పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News