Wednesday, January 22, 2025

గ్రేటర్‌లో టీకా పట్ల ఆసక్తి అంతంతే…

- Advertisement -
- Advertisement -

సెకండ్ డోసు, టీనేజర్ల వ్యాక్సిన్ పట్ల నిర్లక్ష్యం
పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదైతున్న పట్టించుకోని జనం
ఇప్పటివరకు సెకండ్ డోసు 80శాతం, టీనేజర్లు 45శాతం పంపిణీ
ఈనెలాఖరు వరకు పూర్తి స్దాయిలో తీసుకోవాలని వైద్యసిబ్బంది ప్రచారం

Bihar Doctor Took 5 Covid-19 Vaccines
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యశాఖ వ్యాక్సిన్ పెద్ద ఎత్తున పంపిణీ చేసేందుకు చర్యలు చేపడితే ప్రజలు టీకా పట్ల నిర్లక్షం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది జనవరిలో మొదటి డోసు మొదలు పెట్టగా ప్రారంభంలో ముందుకు వచ్చి టీకా తీసుకోగా, సెకండ్ డోసు విషయంలో ఇప్పటికి ప్రజలు పట్టించుకోవడంలేదని వైద్యశాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. పస్ట్‌డోసు 107శాతం నమోదుగా, సెకండ్ వ్యాక్సిన్‌ను 80శాతం మాత్రమే నమోదైంది. ఇంకా 20శాతం మంది తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా ఈనెల 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి టీకా పంపిణీ చేపడితే ముందు వారం రోజుల పాటు పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థులు ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నారు. సంక్రాంతి పండుగ తరువాత వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆశించిన స్దాయిలో ముందుకు రావడంలేదని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ మూడు జిల్లాల పరిధిలో 5,27, 542 మంది టీనేజర్లను వ్యాక్సిన్ పంపిణీ కోసం గుర్తించినట్లు తెలిపారు. గత 25 రోజుల నుంచి టీకా పంపిణీ చేస్తుండగా ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలో 49 శాతం మంది తీసుకున్నట్లు నగరంతో సహా 12 కార్పొరేషన్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి టీకా వేస్తున్నట్లు, కేంద్రాల్లో గుంపులుగా ఉండగా జాగ్రత్తలో భాగంగా ఈవిధానం తీసుకొచ్చినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు సెంటర్ల వద్ద వెయిట్ చేయాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఆరగంట పాటు కేంద్రాల్లో ఉండాలన్నారు. మొదటి డోసు వేసుకున్న తరువాత 28 రోజులకు రెండో డోసు తప్పకుండా వేసుకోవాలన్నారు. టైపాయిడ్ ఇతర జబ్బుల బారినపడి ఏఆర్వీ తదితర వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆతేదీ నుంచి నాలుగు వారాల తరువాత కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

హైదరాబాద్ జిల్లాలో 1,84,822మందిని గుర్తించగా ఇప్పటివరకు 91196 మంది తీసుకున్నట్లు, రంగారెడ్డి జిల్లాలో 1,77,102 మందిని గుర్తించగా 78236 మంది, మేడ్చల్ జిల్లాలో 1,65,618 మందిని గుర్తించగా 91162 మంది టీకా తీసుకున్నట్లు, గ్రేటర్ వారీగా చూస్తే ఇప్పటివరకు 45 శాతంకు వరకు తీసుకున్నట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నారు. టీకా తీసుకునేందుకు అర్హులు ఆసక్తి చూపడంతో వైద్యాధికారులు ఈనెల 31వరకు వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు గడువు పొడిగించారు. ఇప్పటివరకు తీసుకోని వారందరు ఈనెలాఖరు తీసుకోవాలని ఇంటింటి సర్వేలో వైద్య సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. టీకా పట్ల నిర్లక్షం వహిస్తే భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు వచ్చిన ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News