- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మార్చి 1తేదీ నుంచి 60ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు వేయనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన 45 ఏళ్లు దాటినవారికి కూడా టీకాలు అందిస్తామన్నారు. దేశంలో మొత్తం పదివేల ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ చేపడతామన్నారు. మరో 20వేల ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ ఇస్తామన్న జవదేకర్ వ్యాక్సిన్ల ధరలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే ఇప్పటికే దేశంలో ప్రంట్ లైన్ వారియర్స్ కి కరోనా వైరస్ టీకాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
Corona vaccination for senior citizens from March 1
- Advertisement -