Saturday, December 21, 2024

టీనేజర్లకు టీకా.. డోర్ టూ డోర్

- Advertisement -
- Advertisement -

జిల్లాలో 34 వేల మంది గుర్తింపు
ఇప్పటికి 5 వేల మందికి వ్యాక్సినేషన్
బూస్టర్ డోస్‌కు రంగం సిద్ధం

India is another milestone in corona vaccination

మన తెలంగాణ/వరంగల్ ప్రతినిధి : టీనేజర్లకు టీకా.. ఇక డోర్ టూ డోర్‌గా కొనసాగనున్నది. దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన క రోనా రక్కసి మళ్లి కొరలు చాస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా, ఒమిక్రాన్ వైర స్ రోజురోజుకు పెరుగుతుండడం తో వ్యాక్సినేషన్ ప్రక్రియను ము మ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అల ర్ట్ చేయడంతో తెలంగాణ ప్రభు త్వం అందుకు అనుగుణంగా జి ల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. టీనేజర్లకు వ్యాక్సినేషన్ వేయడంతో పాటు రెండో డోసు త్వరితగతిన పూర్తి చేయాలని ఇచ్చిన ఆదేశాల మే రకు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.

జిల్లాలో టీనేజర్లుగా 15 నుండి 17 సంవత్సరాల వయసున్న వారిని 34 వేల మంది గా తేల్చారు. పదోతరగతి, ఇంటర్మీడియటల్, డిగ్రీ మొదటి, రెండోసంవత్సరం చదివే విద్యార్థులు ఈపరిధిలోకి వస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీ నుండి టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రా రంభం కాగా ఈనెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో రెండురోజులుగా టీకా ప్రక్రియ మందగించింది. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 5 వేల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేసినట్లు తెలుస్తోంది. సెలవుల కారణంగా సొంత ఊర్ల కు వెళ్లిన విద్యార్థులకు ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ వేసేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా గ్రామా ల్లో ఎఎన్‌ఎంలను, ఆశావర్కర్లను ఇంటింటికి పంపుతూ వ్యాక్సినేషన్ ప్ర క్రియను ముమ్మరం చేశారు.

Covid-19 vaccination for 15 to 18 years

టీనేజర్ల టీకా మార్గదర్శకాలివే… టీనేజర్ల టీకాకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. 15 నుండి 17 సంవత్సరాల వయసు ఉ న్నవారికి కోవాక్సిన్ మాత్రమే ఇవ్వాలని నిబంధన ఉంది. పిహెచ్‌సి, సిహెచ్‌సి, యుపిహెచ్‌సి, ఎహెచ్, డిహెచ్‌ల్లోనే కాకుండా ఇంటింటికి వెళ్లి ఇవ్వనున్నారు. టీకా వేసుకోవాలనుకునేవారు ఆధార్ లేదా స్టూ డెంట్ ఐటికార్డుతో కోవిడ్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుం ది. మొదటి టీకాకు, రెండో టీకాకు మధ్య వ్యవధి కనీసం నెల రోజులు కల్పించారు. కోవిడ్ వచ్చి తగ్గిన వారుంటే మాత్రం వారికి మూడు నెల ల తరువాత టీకా వేసుకునే వెసులుబాటును కల్పించారు.

బూస్టర్ డోస్‌కు సిద్ధం… రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్‌రావు బూస్టర్ డోస్‌కు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన లభించింది. బూస్టర్ డోస్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభించేందుకు సన్నాహాలు చే స్తున్నారు. మొదట వైద్య ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వారియర్స్, వృ ద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఇవ్వనున్నారు. కరోనా రెండో డో సు తీసుకున్న తరువాత తొమ్మిది నెలలు లేదా 39 వారాలు దాటిన వా రిని ఇందుకు అర్హులుగా ప్రకటించింది.

తప్పక టీకా వేసుకోవాలి : డిఎంహెచ్‌ఒ వెంకటరమణ

కోవిడ్ నియంత్రణకు ప్రతిఒక్కరు తప్పక టీకా వేసుకోవాలి. టీనేజర్లకు టీకా, ఆరోగ్యశాఖ సిబ్బంది, కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బూస్టర్ డోస్‌ను వేసేందుకు ఏర్పాట్లు చేశాం. కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరు మాస్క్ ధరించాలి. శానిటైజర్ వెంట పెట్టుకోవాలి. గుంపులు గుంపులుగా కాకుండా భౌతిక దూ రం పాటించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News