Monday, December 23, 2024

కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం…

- Advertisement -
- Advertisement -

ఇతర రాష్ట్రాల ప్రభావంతో వైద్యశాఖ ముందస్తు జాగ్రత్తలు
ఆరోగ్య కేంద్రాల వద్ద సరిపడ టీకా నిల్వలు అందుబాటులో
ఇప్పటివరకు వేసుకోని వారు త్వరగా తీసుకోవాలని వైద్యుల సూచనలు
నిర్లక్షంగా ఉంటే వైరస్ సోకిన వారికి ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవని హెచ్చరికలు

Corona vaccination in Telangana
మన తెలంగాణ,సిటీబ్యూరో: గత కొద్ది రోజులుగా దేశ రాజధాని హస్తినలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో వైరస్ ప్రభావం హైదరబాద్‌పై పడే ప్రభావం ఉందని, రోజుకు వందలాది మంది రాకపోకలు సాగిస్తుండటంతో మళ్లీ మహమ్మారి ఉనికి చాటుతుందని వైద్యశాఖ భావిస్తూ ముందుగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు వేగం చేస్తుంది. గత ఆరు నెల నుంచి 18 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వారికి టీకా పంపిణీ చేస్తుంది.కానీ ఆవయస్సు గల యువత ఆశించిన స్దాయిలో టీకా తీసుకోలేదు. ఒకవేళ పోర్త్‌వేవ్ విజృంభణ చేస్తే టీకా తీసుకోని వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యశాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తూ గతంలో ఏర్పాటు చేసి వ్యాక్సిన్ కేంద్రాల్లో సరిపడ సిబ్బందిని ఏర్పాటు చేసి 15 రోజుల్లో టీకా తీసుకోని వారిని గుర్తించి వీలైనంత త్వరగా తీసుకునేందుకు అవగాహన కార్యక్రమాలు, కాలనీలు, బస్తీలు, కళాశాల్లో, స్కూళ్లో ప్రచారం చేసేందుకు స్దానికంగా ఉంటే ఆరోగ్య కార్యకర్తలను సిద్దం చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.

అదే విధంగా వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా బూస్టర్ తీసుకోవాలని వారి కోసం కూడా బస్తీదవఖాలను, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతామంటున్నారు. గతంలో టీకా ధర ఎక్కువగా ఉంటే ధరలు తగ్గించి ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా నిల్వలు ఉంటాయని తెలిపారు. వ్యాక్సిన్ పట్ల నిర్లక్షం చేస్తే ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవని నగర ప్రజలు స్దానికంగా ఉండే ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 12 నుంచి 14 ఏళ్ల లోపు వారిలో 61,285 మంది పస్టు డోసు వేసుకోగా, వీరిలో 6675 మంది మాత్రమే రెండు డోసు తీసుకున్నారు. రంగారెడ్డిలో 79,791 మంది మొదటి డోసు వేసుకోగా, వారిలో 11664మంది రెండో డోసు తీసుకున్నారు. మేడ్చల్ జిల్లాలో 72,042 మంది పస్టుడోసు తీసుకోగా, 6187 మంది మాత్రమే సెకండ్ డోసు పూర్తి చేసుకున్నారు. జిల్లాలో 15 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు వారిలో హైదరాబాద్ జిల్లాలో మొదటి డోసు 1,29,714 మంది తీసుకోగా, సెకండ్ డోసు 86,252 వేసుకున్నారు.

రంగారెడ్డిలో పస్టుడోస్లు 1,33, 347 తీసుకోగా, రెండో డోసు 99,558,మంది వేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలో 1,25,649 మంది మొదటి డోసు వేసుకోగా, సెకండ్ డోసు 90,224,మంది తీసుకున్నారు. 18 ఏళ్లకు పైబడిన వారు హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు మొదటి డోసు 37,09,669 మంది తీసుకోగా, సెకండ్ డోసు 29,97,171 మంది తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 28,11,922 మంది పస్టు డోసు తీసుకోగా, అందులో 24,56,555మంది సెకండ్ డోసు తీసుకున్నారు. మేడ్చల్ జిల్లాలో 26,40,627 మంది పస్టుడోసు వేసుకోగా, వీరిలో 23,77,152మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News