- Advertisement -
హైదరాబాద్: జనవరి 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన జారీ చేసింది. దేశ వ్యాప్తంగా విజయవంతమైన కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ ఏర్పాటు చేశామని పేర్కొంది. 29 వేల కోల్డ్ చైన్ సెంటర్ల ద్వారా వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించింది. అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన పది రోజుల్లోనే టీకాలు వేస్తామని తెలిపింది. దేశ వ్యాప్తంగా 37 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలు ఉన్నాయని, దేశ వ్యాప్తంగా నాలుగు వ్యాక్సిన్ డిపోలు ఏర్పాటు చేశామని వివరించింది. డ్రైరన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని, వ్యాక్సినేషన్ కోసం కరోనా వారియర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, కోవిన్ యాప్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.
- Advertisement -