Wednesday, January 22, 2025

కరోనా టీకా వేసుకున్నాక వ్యాయామం చేస్తే మేలు

- Advertisement -
- Advertisement -

కరోనా టీకా పొందిన తరువాత వ్యాయామం చేస్తే శరీరంలో మేలైన ఫలితాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వ్యాయామం వల్ల ముఖ్యంగా శరీరం లోని యాంటీబాడీల స్థాయి పెరుగుతుండడం తాము గమనించామని అమెరికా లోని లోవా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. ఫ్లూ సోకిన తరువాత లేదాటీకా తీసుకున్న తరువాత కానీ తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా, అలాగే ఓ మోస్తరు నుంచి దీక్షగా 90 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే శరీరంలో యాంటీబాడీల స్థాయి పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

వ్యక్తి ప్రవర్తన, రోగనిరోధక శక్తి నేరుగా ఆ వ్యక్తి ఫిట్‌నెస్ స్థాయిలు పెరగడానికి దోహదపడుతుందని పరిశోధకులు వివరించారు. ఈ అధ్యయనంలో పాలు పంచుకున్న అభ్యర్థులు టీకా తీసుకున్న తరువాత రోజూ గంటన్నర సేపు సైకిల్ తొక్కడం, లేదా వేగంగా నడవడం, చేయగా నాలుగు వారాల్లో వారిలో యాంటీబాడీల స్థాయిలు బాగా పెరిగాయని పరిశోధకులు వివరించారు. వ్యాయామం చేయలేని వారిలో ఇలాంటి పరిణామాలేవీ జరగలేదని పేర్కొన్నారు. ట్రెడ్‌మిల్స్‌తో ఎలుకలపై ఇలాంటి ప్రయోగాలు చేయగా ఇదే విధమైన సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు. 2021 మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో 36 మందికి ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చి ప్రయోగాలు చేశారు.

28 మందిపై సీజనల్ ఇన్‌ఫ్లుయెంజాకు టీకా రెండు డోసుల ప్రయోగం చేశారు. ప్రయోగాల్లో పాల్గొన్నవారిలో సగానికి సగం మంది ఎక్కువ బరువు లేదా స్థూలకాయుల కేటగిరికి చెందిన వారు. 90 నిమిషాల వ్యాయామ సమయంలో వారు నడిచే దూరం కన్నా వారి గుండె నిమిషానికి 120 నుంచి 140 సార్లు కొట్టుకునేలా దృష్టి కేంద్రీకరించారు.45 నిమిషాల వ్యాయామ సమయం లోనూ ఇలాగే జరుగుతోందా లేదా అని పరిశీలించారు. తక్కువ సమయం వ్యాయామంలో యాంటీబాడీల స్థాయి పెరగడం లేదని తెలుసుకున్నారు. సుదీర్ఘకాలం తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వ్యాయామం వల్లనే యాంటీబాడీల స్థాయి పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని లోవా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఇలా వ్యాయామం ఎక్కువ సేపు ఎక్కువ కాలం చేస్తే శరీరం లోని రక్తప్రసరణ, శోషరస ప్రవాహం (లింఫ్‌ఫ్లో) బాగా వ్యాపించి ఇమ్యూన్ కణాలు మరింత విస్తరించడానికి,ఇమ్యూనిటీ స్పందన పెరగడానికి వీలవుతుందని వివరించారు.

శరీరం లోని ఇతర వేరే కణాలను కూడా గ్రహించి వాటిని తొలగిస్తాయని చెప్పారు. ఎలుకల ప్రయోగం నుంచివచ్చిన డేటాలో వ్యాయామం సమయంలో ఒకరకమైన ప్రొటీన్ ఉత్పత్తి అవుతుందని , వైరస్‌కు సంబంధించిన యాంటీబాడీలు , టి సెల్స్ ఉత్పత్తి అవుతాయని వెల్లడైంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోడానికి మరింత పరిశోధన విస్తృతంగా నిర్వహించాలని పరిశోధకులు పేర్కొన్నారు. వ్యాయామం చేసే టప్పుడు జీవక్రియ, జీవరసాయన క్రియ, న్యూరో ఎండోక్రైన్, ప్రసరణ ఈ ప్రక్రియలన్నీ జరుగుతాయని , ఇవన్నీ యాంటీబాడీల స్పందనను పెంపొందించడానికి తోడ్పడతాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News