కరోనా కట్టడి దిశలో బైడెన్ లక్ష్యం
వాషింగ్టన్ : ఈ నెల 19 నాటికి అమెరికాలోని వయోజనులందరికీ కరోనా వ్యాక్సిన్ అందేలా చేసితీరుతామని ప్రెసిడెంట్ జో బైడెన్ తెలిపారు. కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తచర్యలు, ప్రత్యేకించి వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి రాష్ట్రాలన్నింటికీ బైడెన్ ఇప్పటికే తుది గడువు విధించారు. ఈ గడువు విషయంలో రాజీ లేదని, అమెరికాలో అర్హులైన అడల్ట్ అందరికీ వ్యాక్సిన్ 19 నాటికి అందాల్సిందేనని వైట్‌హౌస్‌లో ఓ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఓ పట్టాన తగ్గిపోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ బెడద సమసిపోయిందని భావించరాదు. కరోనా అంతానికి చేయాల్సింది ఎంతో ఉంది. ఇప్పటికీ వైరస్ విషయంలో మన జీవన్మరణ పోరు కొనసాగుతూనే ఉందని తెలిపారు. ఇంతకు ముందున్న వైరస్‌కు తోడుగా కొత్త నమూనా కరోనా వైరస్‌లు వచ్చిపడుతున్నాయి. ఇవి త్వరిగతిన వ్యాపిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికీ ఆసుపత్రులలో భారీ సంఖ్యలో రోగులు చేరుతూనే ఉన్నారు. వైరస్ మహమ్మారిగా పీడిస్తోందని అన్నారు. ఈ తరుణంలో పౌరులు తమ కనీస బాధ్యతలను పాటించాల్సి