Monday, December 23, 2024

వృషణకణజాలంపై కరోనా వైరస్ దాడి…

- Advertisement -
- Advertisement -

వృషణకణజాల ఎంజైమ్‌లో వైరస్ తిష్ట

న్యూఢిల్లీ : తీవ్రస్థాయి కోవిడ్ మనిషి ప్రాణాలు తీయడమే కాకుండా మగవారిలో వీర్యంపై ప్రతికూల ప్ర భావం చూపుతోందని పాట్నాలోని ఎయిమ్స్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా రెండు మూడేళ్ల నుంచి సార్స్ కోవ్ 2 వైరస్ మానవాళిని శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తూ వస్తోంది. దీర్ఘకాలం వైరస్ ప్రభావానికి గురైన మగవారిలో క్రమేపీ పురుషత్వపు సంకేతాలైన వీర్య కణాలు తగ్గిపోవడం లేదా దెబ్బతినడం జరుగుతోందని పరిశోధకులు నిర్థారించారు. దాదాపు 30మంది మగవారిపై సర్వే జరిపారు.

మగవారిలో వీర్య ఉత్పత్తికి సంబంధించి అత్యంత కీలకమైన వృషణ కణజాలంపై వైరస్ కణాల దాడి జరుగుతోంది. వైరస్ మనిషిలో బహుళ అవయవాల నష్టానికి దారితీస్తోంది. వృషణకణజాలంలో సమృద్ధిగా ఉండే ఎసిఇ2 ఎంజైమ్ ద్వారా కణజాలంలోకి ప్రవేశిస్తోంది. ఈ క్రమంలో వీర్య ఉత్పత్తి, వీర్య సామర్థం దెబ్బతినడమే కాకుండా ఆ తరువాత వైరస్ మరింత బలంగా మనిషి కణజాలాలోకి చేరుకునేందుకు రంగం సిద్ధం అవుతుంది. అయితే వైరస్ బారి నుంచి వ్యక్తి బయటపడ్డా, ఆ తరువాతి క్రమంలో మగవారిలో వీర్య కణాలు తగ్గుముఖం పడుతున్నాయని గుర్తించారు.

ప్రత్యేకించి మనిషిలో బహుళ అవయవాలు వైరస్ ద్వారా దెబ్బతినడానికి ఈ వృషణకణజాలం దాడి ప్రాంతం కావడం, ఆ తరువాతి క్రమంలో మగవారి దాంపత్య జీవిత క్రమానికి గండిపడటం వంటి పరిణామాలు తలెత్తుతున్నాయని, పైగా ఇక్కడి ఏక్ ఎంజైమ్ కోవిడ్ వైరస్ దాడికారక ప్రోటిన్లకు గ్రాహకం కావడం కీలక పరిణామం అయిందని పరిశోధకులు తెలిపారు. ఎయిమ్స్ పరిశోధకుల విశ్లేషణలో ఫలితాలను క్యూ రెస్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రచురించారు. కోవిడ్ సోకిన పురుషులలో జరిపిన అధ్యయన క్రమంలో కొందరిలో వీరి వీర్యంలో వైరస్ కణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే వీర్యంలో వైరస్ కణాల వల్ల మగవారి ద్వారా సంతానోత్పత్తి శక్తిపై ప్రభావం, వీర్యం ఉత్పత్తిపై పడే ప్రబావం గురించి పూర్తి స్థాయి సమాచారం అందుబాటులోకి రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News