Monday, December 23, 2024

కరోనా వైరస్ కోసం చైనా సింగర్ తహతహ

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: కరోనా వైరస్‌ను కావాలనే తన శరీరంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించిన చైనా పాప్ సింగర్ జేన్ జాంగ్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో తిట్లు పడుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వారి ఇళ్లలోకి కావాలనే వెళ్లి వైరస్‌ను తన శరీరంలోకి ప్రవేశింపచేయడానికి ప్రయత్నించానని జేన్ చేసిన ప్రకటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

కొత్త సంవత్సరం సందర్భంగా జరిగే సంగీత వేడుకలలో తాను పాల్గొంటున్నానని, అక్కడ ఎవరి ద్వారానో కరోనా వైరస్ సోకడం ఎందుకని తానే ముందుగానే కరోనాను అనుభవించదలచానని జేన్ చెప్పుకుంది. కరోనా వైరస్ తనకు ఒక్కరోజులోనే తగ్గిపోయిందని, బరువు తగ్గి తన చర్మం ఇప్పుడు మరింత అందంగా ఉందంటూ ఆమె చేసిన కామెంట్లు నెటిజన్లకు చిర్రెత్తుతున్నాయి. ఆమెపై నెటిజన్ల ట్రోల్స్ దాడి పెరగిపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితులలో జేన్ తన కామెంట్లకు క్షమాపణ చెప్పడమే కాక తన వివాదాస్పద ట్వీట్‌ను డెలిట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News