Tuesday, November 5, 2024

ఢిల్లీలో తగ్గిన కరోనా కేసులు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో కరోనా విలయతాండవం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 6500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేజ్రీవాల్ తెలిపారు. పాజిటివిటీ రేటు 11 శాతం తగ్గిందన్నారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభించడంతో 15 రోజుల్లో 1000 ఐసియు బెడ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంక్ ఏర్పాటు చేశామని, హోమ్‌ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు కాన్సంట్రేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయని, మొత్తం 40,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉన్నాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News