Wednesday, January 22, 2025

కరోనా ఉద్ధృతి… మహారాష్ట్రలో మళ్లీ మాస్క్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

Corona virus more spread in Maharashtra and kerala

ముంబై : మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి ఎక్కువవుతోంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఉపక్రమించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ల నిబంధనను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈమేరకు అదనపు చీఫ్ సెక్రటరీ …. జిల్లా అధికారులకు రాసిన లేఖలో ఆదేశించారు. టెస్టింగ్, ట్రాకింగ్ ను వేగవంతం చేయాలని, జిల్లా యంత్రాంగాన్ని సూచించింది. మహారాష్ట్రలో ఇటీవలే బిఎ 4,బిఎ 6 సబ్ వేరియంట్ కేసులు నమోదవ్వడంతో ప్రజలంతాఅప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరింది. మూడు నెలల తరువాత తొలిసారిగా జూన్ 1 న మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ వెయ్యి దాటింది. శుక్రవారం 1134 కొత్త కేసులు వెలుగు చూడగా, మూడు మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబై లోనే 763 కేసులు బయటపడ్డాయి. యాక్టివ్ కేసులు మళ్లీ 5 వేలు దాటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News