కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న అధికారులు
దుకాణాల్లో గుంపులుగా చేరితే జరిమానాలు వేస్తామని హెచ్చరికలు
మాస్కులు లేకుంటే షాపుల్లోకి అనుమతి ఇవ్వవద్దని యాజమానులకు సూచనలు
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో ఒమిక్రాన్ వై రస్ ఉనికితో పాటు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వైద్య చికిత్స కంటే నియంత్రణతోనే వైరస్ కట్టబడి చేయవచ్చని వైద్యశాఖ అధికారులు కోవిడ్ నిబంధనలు జనసంచారం ఉండే ప్రాంతాల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్దమైతున్నారు. ప్రధాన మార్కెట్లు, షాషింగ్ మాల్స్, విద్యాసంస్థ్దలు, టిఫిన్ సెంటర్లు వంటి చోట రద్దీ కనిపిస్తుంది. భౌతికదూరం పాటించాలని గత ఐదారు రోజుల నుంచి ప్రచారం చేస్తున్న కొంతమంది పట్టించుకోవడం లేదు. దీంతో ముందుగా వైరస్‌కు హాట్‌స్పాట్ జోన్లుగా గుర్తించిన జియాగూడ, మేకలమండి, మలక్‌పేటగంజ్, బేగంబజార్, పాతబస్తీ లాడ్‌బజార్, మాదన్నపేట, గుడిమాల్కాపూర్, సరూర్‌నగర్, కొత్తపేట పండ్ల మార్కెట్, ఎన్టీఆర్నగర్ కూరగాయల మార్కెట్, మోండా, అబిడ్స్ జగదీష్ మార్కెట్, మోజంజహీ పూల మార్కెట్లన్ని నిత్యం జన సందడి మారాయి. ఈప్రాంతా ల్లో ముందుగా కొవిడ్ నిబంధనలు కఠినం చేసి, మా స్కులు లేకుండా, గుంపులుగా ఉన్న వ్యాపారులకు జరిమానాలు వేసేందుకు నడుం బిగించారు.
ప్రతి దుకాణం వద్ద కరోనా నిబంధనలు పాటించేలా బోర్డులు, ప్రధాన ద్వారం వద్ద శానిటైజర్ ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. వెయ్యి జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరిలో థర్డ్‌వేవ్ వచ్చే పరిస్దితులు కనిపిస్తున్నాయని ప్రభుత్వ హెచ్చకరిలతో జిల్లా వైద్యాధికారులు ముందుస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. నగర ప్రజలు మరో ఆరువారాల పాటు ముఖానికి మాస్కులు, బయటకు వెళ్లినప్పుడు వ్య క్తుల మధ్య భౌతికదూరం పాటిస్తే వైరస్ విస్తరించకుండా కళ్లెం వేయవచ్చని చెబుతున్నారు. వచ్చే వారంలో పాజిటివ్ కేసులు సంఖ్య 300లు దాటితే రాత్రి కర్పూ విధించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అ ధికారులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ వైరస్‌ను ప్రారంభంలోనే అడ్డుకట్టవేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, నిర్లక్షం చేస్తే ప్రాణాలను బలిగొటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో గత వారం రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు రో జుకు 60 నుంచి 80 వరకు నమోదైతున్నట్లు, క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్‌వేవ్ రాకుండా చూడవచ్చని వెల్లడిస్తున్నారు. అదే విధంగా డిసెంబర్ మాసంలో పెళ్లిళు ఎక్కువ ఉండటంతో వస్త్ర, బంగారం, స్టీల్ అమ్మకాల దుకాణాలు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. ఆదుకాణాల నిర్వహకులకు కూడా కస్టమర్ల మధ్య బౌతికదూరం పాటించేలా ప్రత్యేక సిబ్బంది నియమించి, గుంపులుగా ఒకే దగ్గర చేరకుండా చూడాలని సూచనలు చేస్తున్నారు.