- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 0.43 శాతంగా ఉందని, తెలంగాణలో 1100 ప్రాంతాల్లో యాంటిజెన్ పరీక్షలు నిర్వహించామని, కోవిడ్ బాధితులకు వెంటనే మెడిసిన్ కిట్స్ అందిస్తున్నామని, 75 శాతం మంది హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ ఇచ్చామని ప్రకటించారు. మార్చి 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణలో కరోనా వైరస్ తగ్గు ముఖంలో ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 2.98 లక్షల మందికి కరోనా సోకగా 1633 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 2.95 లక్షల మంది కోలుకోగా 1939 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 86.6 లక్షల మందికి కరోనా టెస్టులు చేశామని వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -