Wednesday, January 22, 2025

షాంఘైలో కరోనా విలయం… సైన్యాన్ని దింపిన చైనా

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా విలయ తాండవం చేస్తోంది. చైనాలో మొత్తం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరం లోనే బయటపడుతున్నాయి. దీంతో షాంఘైలో వైరస్ కట్టడికి చర్యలను చైనా ప్రభుత్వం చేపట్టింది. పరీక్షలను పెంచడంతోపాటు పెద్ద ఎత్తున ఆరోగ్యకార్యకర్తలు, సైన్యాన్ని నగరానికి ప్రభుత్వం పంపింది. సోమవారం దేశ వ్యాప్తంగా 18 వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా, దాదాపు 9 వేల కేసులు ఒక్క షాంఘై లోనే ఉండటం గమనార్హం. ఈ నగరంలో గత వారం లాక్‌డౌన్ విధించారు.
సోమవారం నుంచి ట్విన్ కొవిడ్ పరీక్షలు మొదలు పెట్టారు. అంటే ప్రతి పౌరుడికి యాంటీజెన్, న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సైన్యాన్ని రంగం లోకి దింపింది. ఆర్మీ, నేవీ నుంచి దాదాపు 2 వేల మందికి పైగా సిబ్బందిని నగరానికి పంపింది. దీంతోపాటు దాదాపు 15 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు , వైద్య సిబ్బందిని షాంఘైకి తరలిలంచినట్టు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. షాంఘై పొరుగున ఉన్న జియాంగ్జు, జెజియాంగ్ తదితర ప్రావిన్సుల నుంచి ఈ సిబ్బందిని నగరానికి పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News