జర్మనీ ఇఎంబిఎల్ పరిశోధకుల అధ్యయనం
బెర్లిన్ : అతిధి కణాలను ఆక్రమించుకోడానికి కరోనా వైరస్ మానవ శరీరంలోని కొన్ని ప్రొటీన్లభాగాలను వినియోగించుకోవడాన్ని శాస్త్రవేత్తలు కనుగొనగలిగారు. దీనివల్ల కొవిడ్ 19 చికిత్సకు కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడానికి మార్గం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన మంజీత్‌కుమార్‌తోపాటు జర్మనీ లోని యూరోపియన్ మోలిక్యులర్ బయోలజీ లేబొరేటరీ (ఇఎంబిఎల్) ఈ పరిశోధనను చేపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిలో జోక్యం చేసుకునేలా మానవ ప్రొటీన్లను తయారు చేసే అమినో యాసిడ్ మోలిక్యూల్స్ గొలుసును పరిశోధకులు విశ్లేషించ గలిగారు. ఈ తరగతికి చెందిన ప్రొటీన్లను ఇంటెగ్రిన్స్ అని అంటారు. ఇదివరకటి పరిశోధనలో కొవిడ్19 ను సార్స్ కొవి 2 వైరస్ సంక్రమింప చేస్తుందని, కణం ఉపరితలంపై ఉండే గ్రహీత ఎసిఇ2 కట్టుబడి ఎండోసైటోసిస్ అనే ప్రక్రియ ద్వారా కణాల్లోకి ప్రవేశిస్తుందని, ఇంటెగ్రిన్స్ అనే బలమైన ఇతర ప్రొటీన్లను ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు.
అయితే జర్నల్ సైన్స్ సిగ్నలింగ్ లో ప్రచురితమైన ప్రస్తుత అధ్యయనంలో పరిశోధకులు ప్రత్యేకంగా అమినోయాసిడ్స్ కురచ పోగులపైనే దృష్టి కేంద్రీకరించారు. వీటిని షార్టు లీనియర్ మోటిఫ్స్(ఎస్‌ఎల్‌ఐఎంఎస్) అని అంటారు. కణాల బయట, లోపల మధ్య సమాచారాన్ని వ్యాపింప చేయడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. అనేక ఇంటెగ్రిన్స్ షార్టు లీనియర్ మోటిఫ్స్‌ను కలిగి ఉండడం పరిశోధకులు గమనించారు. ఇవి కణాలు పదార్థాలను స్వీకరించడం, విడిచిపెట్టడం అనే ప్రక్రియల్లో ఇవి జోక్యం చేసుకుంటాయి. ఈ ప్రక్రియలను ఎండోసైటోసిస్, ఆటోఫజీ అని పిలుస్తారు. ఈ ఎండోసైటోసిస్, ఆటోఫజీ ప్రక్రియల్లో పాత్ర వహించే ప్రోటీన్లను సార్స్ కొవి 2 లక్షంగా చేసుకుంటే అంటే ఈ ప్రక్రియలు వ్యాధి సంక్రమించే దశలో వైరస్ వల్ల హైజాక్ అయ్యాయని అర్థం చేసుకోవాలని ఎఎంబిఎల్ అధ్యయన పరిశోధకులు బాలింట్ మెస్‌జరోస్ చెప్పారు.