Monday, December 23, 2024

మే 6న కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్‌లో కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం మే 6న జరుగుతుంది. రాణి ఎలిజబెత్ మరణం తరువాత గత ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన ఆయన వంశపారంపర్యగా కింగ్‌గా నియమితులు అయ్యారు. వారాంతంలో శనివారం కింగ్ ప్రమాణం ఉంటుంది. ఇప్పటికైతే ఛార్లెస్ పట్టాభిషేకం ఆ రోజు ఏ సమయంలో కార్యక్రమం ఉంటుందనేది వెల్లడికాలేదు. బుధవారం రాజకుటుంబ వర్గాలు అధికారికంగా ఆయన ప్రమాణస్వీకార తేదీని ప్రకటించాయి.

లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబేలో కార్యక్రమం ఉంటుంది. ఇదే దశలో క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కూడా ఉంటుంది. తరువాతిరోజు విండ్సర్ క్యాజిల్‌లో పట్టాభిషేక ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీనికి సామాన్యులకు కూడా అనుమతి ఉంటుంది. కోహినూర్ లేని కిరీటంతనే పట్టాభిషేకానికి రాణి కెమిల్లా హాజరవుతారని వెల్లడైంది. వలసవాద పాలనకు సంకేతంగా, వివాదాస్పదంగా ఉన్న ఈ వజ్రంతో కూడిన కిరీటాన్ని ధరించడం తనకు ఇష్టం లేదని కెమిల్లా తెలిపారు. ఈ మేరకు వేరే వజ్రంతో కూడిన కిరీటంతోనే ఆమె ఈ ఉత్సవానికి వస్తారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News