Friday, September 20, 2024

శీతాకాలంలో మళ్లీ కరోనా ముప్పు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత మూడు వారాలుగా కొత్త కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి నిదానంగా ఉన్నా శీతాకాలంలో కరోనా ముప్పు వచ్చే పరిస్థితిని కాదనలేమని నీతి అయోగ్ సభ్యుడు, కరోనా వ్యాక్సిన్ నిర్వహణ జాతీయ నిపుణుల సమన్వయ కమిటీ (ఎన్‌ఇజివిఎసి) ఛీఫ్ వికె పాల్ హెచ్చరించారు. కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో, మూడు నుంచి నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయని, ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన వివరించారు. ఉత్తరాదిలో శీతాకాలంలో ఎదురయ్యే కాలుష్యం, పండగల సీజన్ కారణంగా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ నిల్వ, సరఫరాకు సంబంధించి కోల్డ్ స్టోరేజి గురించి ప్రశ్నించగా, దేశంలో తగినంత కోల్డ్ స్టోరేజి సౌకర్యాలు ఉన్నాయని, అవసరాలకు తగినట్టు సిద్ధంగా ప్రస్తుతం ఉన్నాయని వివరించారు.

Coronavirus 2nd wave infection possibility in Winter: VK Paul

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News