లండన్: ఇతరులకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నంత మాత్రాన కరోనా సోకదన్న గ్యారెంటీ ఏమీ లేదని, కరోనా వైరస్‌తో కూడిన తుంపర్లు గాలిలో ప్రయాణిస్తూ అంతకు మించిన దూరంలో ఉన్నవారిని కూడా చేరుకుంటున్నట్టు కేంబ్రిడ్జి యూనివర్శిటీ పరిశోధకులు స్పష్టం చేశారు. మాస్క్ ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని సూచించారు. కరోనా బాధితులు మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా, చీదినా, ఆవళించినా వారి నోటి నుంచి కరోనా వైరస్‌తో కూడిన గాలి తుంపర్లు విడుదల అవుతాయి. ఇవి వివిధ గమనాల్లో ఇష్టారీతిన గాలిలో ప్రయాణిస్తాయి. ఇవి సుమారు రెండు మీటర్ల దూరంలోని వ్యక్తులను చేరుకుంటాయని ఇదివరకు అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఇదే సురక్షిత దూరమని కచ్చితంగా చెప్పలేమని , మూడు మీటర్లకు మించి కూడా ఈ తుంపర్లు ప్రయాణించవచ్చని భారత సంతతికి చెందిన పరిశోధనకర్త డాక్టర్ శ్రేయ్ త్రివేది పేర్కొన్నారు. ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ పత్రిక ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపింది.
Coronavirus to travel with Air above 3 Km up