Monday, December 23, 2024

అడ్మిషన్ల వేటలో కార్పొరేట్ విద్యాసంస్థలు

- Advertisement -
- Advertisement -

అధ్యాపకులకు టార్గెట్ పెడుతున్న యాజమాన్యాలు
ప్రతి టీచరు 10మంది విద్యార్థులను చేర్చాలని ఆదేశాలు
టార్గెట్ చేయకుంటే ఉద్యోగం ఊడుతుందని హెచ్చరికలు

Corporate educational institutions in hunt for admissions

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో కార్పొరేట్ విద్యాసంస్దలు కొత్త ఆడ్మిషన్ల వేటలో పడ్డాయి. గడిచిన ఏడాది కంటే రెండింతలు విద్యార్థులను చేర్చుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటి నుంచి మొదలు పెడితే వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి లక్షం చేరుకుంటామని అంచనా వేస్తున్నారు. అందుకోసం సంస్దలో పనిచేస్తే అధ్యాపకులకు టార్గెట్ పెట్టి రెండు వారాల్లో ప్రతి టీచరు 10మంది పిల్లలను చేర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. యాజమాన్యాలు సూచనలు అమలు చేయకపోతే ఉద్యోగానికి భరోసా ఇవ్వలేమని పేర్కొంటున్నట్లు పలువురు టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీంతో వారు బంధువులు, స్నేహితులకు పోన్లు చేసి ఈసారి మీపిల్లలను మా స్కూళ్లు చేర్చితే విద్యలో రాణిస్తారని వివరిస్తూ వెంటనే ఆడ్మిషను తీసుకోవాలని కోరుతున్నారు. కార్పొరేట్ స్కూల్‌లో చేరాలంటే పేద కుటుంబాలకు సాధ్యంకాదు, ఆర్దికంగా బలపడివారే కార్పొరేట్ దారిపడుతారు. చాలామంది టీచర్లకు ఉన్నత కుటుంబాల వారితో సంబంధాలు లేకపోవడంతో వారు యాజమాన్యాలు విధించిన టార్గెట్ పూర్తి చేసేందుకు విద్యార్ధి సంఘాల నాయకులతో సహకారం తీసుకుంటూ విద్యార్ధులు చేరేలా చూడాలని ప్రాధేయపడుతున్నారు.

ఒక విద్యార్థి ఆడ్మిషన్ ఇప్పిస్తే రూ. 5వేలు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. తాము విద్యార్ధుల కోసం ఇంటింటికి తిరగలేమని, విద్యార్ధిసంఘాల నాయకులకు అప్పగించే పనిలో పడ్డారు పలువురు ఉపాధ్యాయులు. జిల్లాలో 1845 ప్రైవేటు స్కూళ్లు ఉండగా వాటిలో సంక్రాంతి పండుగ తరువాత నుంచే నూతన ఆడ్మిషన్లకు ప్రారంచగా, కరోనా విజృంభణతో సెలవులు పొడిగించారు. మూడు రోజుల కితం బడులు ప్రారంభించడంతో 15 రోజుల్లో తాము టార్గెట్ పెట్టిన విధంగా ఆడ్మిషన్లు చేయాలని యాజమాన్యాలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యాపకులపై ఒత్తిడి పెంచినట్లు సిబ్బంది చెబుతున్నారు.

శివారు ప్రాంతాల్లో పేరుమోసిన పలు ప్రైవేటు స్కూళ్లు ముందుస్తుగా ఆడ్మిషన్లు చేపట్టి కోట్లాది రూపాయలు మూట్టగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బిసి విద్యార్ధి సంఘం నేత బి. సైదులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం జూన్‌లో ఆడ్మిషన్లు తీసుకోవాల్సిన సంస్దలు ఆరునెలల ముందే తీసుకోవడంపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు ఎవరు వెళ్లరని, నగరంలో అన్ని పాఠశాలలకు ఒకే రూల్స్ వర్తించేలా చూడాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News