Monday, December 23, 2024

ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రం ఓ సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం గరిడేపల్లి మండలంలోని తుమ్మయిగడ్డలో గల ప్రాథమిక పాఠశాలలో మౌళిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రూ.10లక్షలతో ప్రహరీగోడ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్ధాయి విధ్య నందిస్తుందన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించిందన్నారు. అనంతరం గరిడేపల్లిలోని 12వ వార్డులో 3లక్షల మండల పరిషత్ నిధులతో సీసీడ్రైనేజీ పనులకు శంకుస్ధాపన చేశారు.ఇటీవల చనిపోయిన పాఠశాల ప్రధానోపాద్యాయులు బుడిగ వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, జడ్పిటిసి పోరెడ్డి శైలజ రవీందర్‌రెడ్డి,సర్పంచ్ త్రిపురం సీతారాంరెడ్డి,వైస్ ఎంపిపి గుత్తికొండ ప్రమీల వెంకటరెడ్డి,మండల బీఆర్‌ఎస్ అద్యక్షుడు కృష్ణనాయక్,మాజీ మార్కెట్ కడియం వెంకటరెడ్డి, ఎంపీటీసి కడియం స్వప్న,మండల విద్యాదికారి పానుగోతు చత్రునాయక్,మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్‌గౌడ్, ఉపసర్పంచ్ సైదాబీ రాజ్‌మహ్మద్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News