- Advertisement -
హైదరాబాద్: ఆర్.సి. పూర్ ఇఎస్ఐ ఆసుపత్రిని 20 కోట్ల 70 లక్షలతో ఆధునికీకరణ పనులు పూర్తి చేసి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రామచంద్రపురం పరిధిలోని ఇఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. పఠాన్ చెరు ప్రాంత కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించడం సంతోషంగా ఉందని, అన్ని సదుపాయాలు ఉన్న రోగులకు వైద్య సేవలు చేయకపోవడంపై వైద్యులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం చేయడంతో నిర్లక్ష్యం చేయవద్దని హరీష్ రావు హెచ్చరించారు.
- Advertisement -