Sunday, January 19, 2025

కార్పొరేట్ విద్యకు కట్టడి ఎలా?

- Advertisement -
- Advertisement -

విద్యా సంస్థల ఫీజులు, డొనేషన్ల దోపిడీకి అంతు లేకుండా పోతున్నది. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల కట్టడిపై ప్రభుత్వం మాట కూడా ఎత్తడం లేదు. దీంతో ఫీజులు మళ్లీ ఎలా పెంచుతారో అంటూ పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 10,700 వరకు కార్పొరేట్ ప్రైవేటు స్కూల్స్ ఉండగా, వీటిలో 32 లక్షల మంది చదువుతున్నారు. బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కొంత తక్కువగానే ఉండగా మిగిలిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో మాత్రం భారీగానే వసూలు చేస్తున్నారు. ఒక్కో స్కూల్లో క్లాసును బట్టి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తున్నది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు బడులు విద్యార్థుల చదువును సంతలో సరుకుగా మార్చేశాయి. స్కూళ్ళు ప్రారంభం కానున్నాయి, దోపిడీ మొదలైంది. అడ్మిషన్ తీసుకోవాలంటే డొనేషన్లని, బుక్స్‌కు సపరేట్ అని, యూనిఫామ్‌కు సపరేట్ అని, ఐఐటి ఫౌండేషన్ అయితే సపరేట్, బస్సు ఫీజు సపరేటు అని ఇలా రకరకాల పేర్లతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు పాఠశాలల యాజమాన్యాలు. తమ పిల్లలను ఉన్నతమైన, నాణ్యమైన చదువులను చదివించాలని తల్లిదండ్రుల కార్పొరేట్ మోజులో పడి ప్రైవేట్ విద్యా సంస్థలకు కాసుల వసూళ్లకు అవకాశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అక్రమ వసూళ్లకు తెర తీశారు. పట్టణాల్లో చదవాలంటే హాస్టలు వసతి కూడా వారికి అవసరమవుతుంది. దీంతో స్కూలు, హాస్టల్ పేరుతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు, ఆ తర్వాత విద్యార్థులకు పాఠశాలను బట్టి రూ. 60 వేల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు తాము తక్కువ కాదంటూ కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఇదే సంప్రదాయానికి దిగాయి. సాధారణ చదువులతో ఐఐటి ఫౌండేషన్ అంటూ మరి కొంత నొక్కుతున్నాయి. దీంతో విద్యార్థులను స్కూళ్లలో చేర్పించేందుకు వచ్చి, వెనక్కి వెళ్ళలేక చేర్పించే సాహసం చేయలేక తలిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. నేడు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ, దోపిడీ చేస్తూ అక్షరాలను వ్యాపారంగా కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా కార్పొరేట్, సెమీ కార్పొరేట్ తరహా పాఠశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాల దోపిడీకి అడ్డుఅదుపు లేకుండాపోయింది. వీటిని నిరోధించాల్సిన అవసరం విద్యాశాఖ పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడిగా నిబంధనలు పాతరవేస్తున్నారు.ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు చైతన్యమై ప్రభుత్వ నిబంధనలు, విద్యాహక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధనలు కనుక చూసినట్లయితే సెక్షన్- 6 ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి. సెక్షన్ -11 ప్రైవేటు యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన్ 1, 2 ప్రకారం స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరాలను నోటీస్ బోర్డ్‌లో పెట్టాలని చట్టం చెబుతుంది. సెక్షన్ -12 ప్రకారం టీచర్, విద్యార్థుల నిష్పత్తి 1:20 కి మించరాదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమాన్యం 25% సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులకు, మైనారిటీలకు కేటాయించాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్ బుక్స్, యూనిఫారాలు, స్కూల్ బ్యాగులు, ఇతర స్టేషనరీని అమ్మరాదు. ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా సూచించరాదు.డి.ఎడ్ లేదా బి.ఇడి అర్హత ఉండాలి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల టీచర్లు డిఎడ్ లేదా బిఇడి అర్హత ఉండి టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. విద్యార్థుల ఫీజు వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలి. జివొ నెంబర్ 42 ప్రకారం డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయరాదు. ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో పాఠశాలల్లో 1000 చదరపు మీటర్లు. గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. పాఠశాల పక్కా భవనంలో నిర్వహించాలి. ప్రతి పాఠశాలలో సలహాలు, సూచనలకు ఫిర్యాదు బాక్సులు ఉండాలి. ఫీజు స్లిప్పులను చిన్నారుల చేతికి రాసిఇస్తే జరిమానా ఉంటుంది. అభం శుభం తెలియని చిన్నారుల చేతికి స్కూల్ ఫీజుల రసీదులు ఇస్తున్నారు పాఠశాల యాజమాన్యం. మీ అమ్మనాన్న ఇంకా ఫీజు చెల్లించలేదంటూ వారిని కించపరుస్తున్నారు. గతంలో చిన్నారి చేతికి రసీదు ఇచ్చిన ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన యాజమాన్యానికి భారీ ఎత్తున జరిమానా విధించింది విద్యాశాఖ. అనుమతులు లేకుండా స్కూళ్లను ప్రారంభించకూడదు. ప్రభుత్వ అనుమతితోనే ప్రారంభించాలి. ఆరు నెలల్లోపు అనుమతులు పొందాలి. ప్రభుత్వ సూచనల ప్రకారం ఫీజులు తీసుకోవాలి. 20 మంది చిన్నారులకు ఒక ఉపాధ్యాయుడు, ఒక సంరక్షకుడు ఉండాలి. రక్షణ, భద్రతా, పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. భవనానికి ప్రహరీ ఉండి, గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి. చిన్నారులు నిద్రపోవడానికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ఉండాలి. మరుగుదొడ్లు, స్నానాల గదిలో టవలు, సబ్బులు ఉంచి, పరిశుభ్రత చర్యలు పాటించాలి. ప్లే స్కూల్‌కు తప్పనిసరిగా ప్లే స్కూల్ అని బోర్డు పెట్టాలి. ప్రవేశాలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల కమిటీని నెలలోపు నియమించాలి. ఇందులో 50% తల్లులు, 25% ఉపాధ్యాయులు, 25% తండ్రులు ఉండేలా చూడాలి. ఈ కమిటీని ఏటా మారుస్తుండాలి. ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను నమోదు చేయాలి. పిల్లలకు జంక్‌ఫుడ్‌ను అనుమతించకూడదు. పోషకాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ఇటువంటి నిబంధనలు చాలా స్కూళ్లు పాటించకుండా నడుపుతా ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో ఎల్‌కెజికి రూ. 1,20,000 వసూలు చేస్తున్నారని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగో తరగతికి రూ. 1,20,000 నుంచి రూ. 1,60,000కు పెంచారని చెబుతున్నారు. ఫీజులు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీనికి కూడా ఒక ప్రత్యేక కమిటీని నియమించి, రాష్ట్ర ప్రభుత్వం పలానా తరగతికి ఫలానా అమౌంట్ తీసుకోవాలని సూచించాలి. దాని ప్రకారమే ప్రైవేటు పాఠశాలలు ఫీజులు తీసుకోవాలి. అలా చేసినట్లయితే ప్రైవేటు పాఠశాల నుండి కొంత ఉపశమనం లభిస్తుందని పిల్లల తల్లిదండ్రులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసి, ఫీజులను నియంత్రించే ఆలోచన చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పాఠశాలల గుర్తింపును రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అప్పుడే ఫీజుల నియంత్రణ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం.

 

అంతరించిపోతున్న జంతువులు, మొక్కలపైన అవగాహన పెంచడానికి, వాటిని రక్షించడానికి ఐక్యరాజ్యసమితి మార్చి 3వ తేదీని ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా ప్రకటించింది. దీంతో వన్యప్రాణుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకుంటున్నాం. పీల్చేగాలి, తినే ఆహారం, మరెన్నో ఇతర ప్రయోజనాల కోసం మనం మొక్కలు, జంతువులపై ఆధారపడి ఉన్నాం. మనకు అవసరమైన పదార్థాలన్నీ ప్రకృతి నుంచి పొందుతున్నప్పటికిని దాని వల్ల సహజ వనరులను, జీవవైవిధ్యాన్ని నష్టపరుస్తున్నామని గుర్తించలేకపోతున్నాము. రాబోయే దశాబ్దాల్లో అన్ని జీవ జాతులలో నాలుగింట ఒక వంతు అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని, ఇలా జీవజాతులు అంతరించిపోతే ప్రకృతిలోని జీవుల మధ్య సమతుల్యత లోపించి మిగతా జీవజాతులు కూడా అంతరించే ప్రమాదం ఉన్నదని, ఈ ప్రభావం మానవ జాతిని కూడా ప్రమాదంలో పడేస్తుందనే నిజాన్ని మానవులు గుర్తించక పోవడం దురదృష్టకరం. జనాభా పెరిగిపోవడం, అడవులు తగ్గిపోవడంతో కాలుష్యంపెరిగి వాతావరణంలో మార్పులు జరిగి జీవజాతులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి.

కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ చట్టాలతో వాటిని రక్షించుకోవాలని మన దేశంలో వన్యప్రాణి సంరక్షణ కోసం 1972లో చట్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం పక్షులను, జంతువులను, చెట్లను సంరక్షించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. జీవవైవిధ్యంతోనే మానవ మనుగడని, లేదంటే మానవ జాతికి ప్రమాదమని, అందుకే వన్యప్రాణులవల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించాలి. మనుషుల స్వార్థానికి అరణ్యాలను నరకడం వల్ల, అడవుల్లో నివసించే లెక్కలేనన్ని వన్యప్రాణుల మనుగడ ప్రమాదంలో పడింది. మనుషుల స్వార్థం ఫలితంగానే దాదాపు పది లక్షలకు పైగా జాతులకు చెందిన వన్యప్రాణులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. వన్యప్రాణులు ఒక్కొక్కటే అంతరించిపోతూపోతే, చివరకు మనిషి మనుగడకే ముప్పు తప్పదని కూడా చెబుతున్నాయి. భారత దేశంలో దాదాపు 551 వన్యప్రాణుల అభయారణ్యాలు, 18 జీవవైవిధ్య అభయారణ్యాలు, 104 నేషనల్ పార్కులు ఉన్నాయి.

వన్యప్రాణులను, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. దేశంలోని 5.1 శాతం భూభాగాన్ని 1.65 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మన ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ కోసం ఉపయోగిస్తోంది. ప్రపంచంలోని దాదాపు 60 శాతానికి పైగా జీవవైవిధ్యానికి ఆశ్రయం కల్పిస్తున్న పదిహేడు దేశాలలో భారత్ ఒకటి. రకరకాల చర్యలతో ప్రకృతి సమతుల్యత గతి తప్పి వన్యప్రాణుల మనుగడకు ప్రమాదం కలుగుతోంది. మన దేశంలో దాదాపు 132 జీవజాతులు అంతరించిపోయే పరిస్థితులకు చేరువగా ఉన్నాయని నివేదికలో హెచ్చరించింది. మన జాతీయ జంతువైన పులి మొదలుకొని చిన్న జంతువులు వరకు, రాబందులు మొదలుకొని పిచ్చుకల వరకు గల పక్షుల సంఖ్య గడచిన శతాబ్దకాలంలో గణనీయంగా తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 87 లక్షల జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయని, వీటిలో పది లక్షల జీవజాతుల మనుగడ ముప్పులో ఉందని ఒక సర్వేలో తేలింది. 2030 నాటికి భూమ్మీద మనుగడ సాగిస్తున్న వాటిలో ప్రమాదం అంచుల్లో ఉన్న 30 శాతం జీవ జాతులను కాపాడుకోవాలని, 2050 నాటికి అంతరించిపోయే స్థితిలో ఉన్నవాటిలో 50 శాతం జీవజాతులను రక్షించుకోవాలని ధృఢసంకల్పం అయితే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News