Thursday, January 23, 2025

కార్పొరేట్ పాఠశాలలను ప్రభుత్వ బడులు ఏమాత్రం తీసిపోవు

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్ధానిక నాయకులు, పాఠశాల సిబ్బందితో కలిసి పుస్తాకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేజి నుంచి పిజి వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు ఒకేసారి 250 గురుకుల పాఠశాలలను ప్రారంభించిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడిందని అన్నారు. గతంతో పోల్చితే ఉత్తీర్ణత శాతం ఎంతో పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకువచ్చి నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుదని తెలిపారు. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాదించిన విద్యార్ధులకు దాత జౌండ్ల ప్రభాకర్‌రెడ్డి సమకుర్చిన నగదును అందజేశారు. సందర్భంగా విద్యార్ధులతో కలిసి ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో సిబ్బందితో పాటు పిల్లలు ఆడుకునేందుకు అటస్థలం ఏర్పాటు చేయాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోరారు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మేల్యే త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈసందర్భంగా పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న దాతలు ప్రభాకర్‌రెడ్డి, బొడిగే రాజుగౌడ్‌లను ఎమ్మెల్యే అభినందించారు. ఈకార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్యామేల్, నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, డప్పుగిరిబాబు, బోడిగే రాజు, సిసిఎస్ ప్రతినిధి ఎం పల్లి పద్మారెడ్డి, కడియాల బాబు, గంపక్రిష్ణ, రెడ్డినాయక్, శంకర్, తాళ్ల వెంకటేష్‌గౌడ్, ఉపాధ్యాయులు శోభరెడ్డి, విజయ్‌కుమార్, సంధ్య, యాదగిరి, రేణుక, నాగిరెడ్డి, యాష్‌పాల్, బాలమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News