Wednesday, January 22, 2025

చైర్మన్ వీరయ్యను సన్మానించిన కార్పొరేషన్ ఉద్యోగ సంఘ నేతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌గా నియమితులైన ముత్తినేని వీరయ్యను ఆ సంస్థ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతలు కలిశారు. సోమవారం చైర్మన్‌ను కలిసి శాలువా, పూల బోకేతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న వీరయ్య సంస్థను మరింత పటిష్టం చేస్తూ ముందుకు పోతారన్న ఆశాభావాన్ని ఉద్యోగులు వ్యక్తం చేశారు. చైర్మన్‌ను కలిసిన వారిలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎస్‌ఎన్ చారి, ప్రధాన కార్యదర్శి ఎస్.రాములు, ఉపాధ్యక్షులు రవీందర్, నీలవ్ ఆథి తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News