Sunday, September 8, 2024

నకిలీ డాక్యుమెంట్ల కేసులో కార్పొరేటర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మీర్ పేట్: నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన కేసులో 13వ డివిజన్ కార్పొరేటర్ నరేందర్ కుమార్(నందు)ను మీర్ పేట్ పోలీసులు అరెస్టు చేశారు. చంపాపేట్ కు చెందిన కృష్ణ అనే వ్యక్తికి కొంగర కలాన్ లో ఉన్నటువంటి భూమికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు చూపించి రూ. 5 కోట్లకు అగ్రిమెంట్ చేశాడు. అయితే రిజిస్ట్రేషన్ చేయించమని అడుగగా చేయించకపోవడంతో కృష్ణకు అనుమానం కలిగింది.

ఆ భూమికి భూ యజమాని వివరాలు తెలుసుకుని సంప్రదించగా…తమ భూమి ఎవరికీ అమ్మలేదని, ఎవరి వద్ద డబ్బు తీసుకోలేదని సదరు యజమాని చెప్పడంతో మోసపోయానని భావించిన కృష్ణ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గురువారం రాత్రి కార్పొరేటర్ నరేందర్ కుమార్ ను అరెస్టు చేశారు. బిజెపి కార్పొరేటర్ గా గెలిచిన అతడ తర్వాత బిఆర్ఎస్ లో చేరాడు. ఆ తర్వాత గత పార్లమెంటు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News