Friday, November 15, 2024

జిహెచ్‌ఎంసి అధికారుల తీరుపై కార్పొరేటర్ భర్త విన్నూత నిరసన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ పంజాగుట్ట: నగరంలోని అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త జీహెచ్‌ఎంసీ అధికారుల పనితీరు పట్ల విన్నూత రీతిలో నిరసన తెలిపారు. అలాగే జీహెచ్‌ఎంసీ అధికారులు పనితీరు, నిర్లక్ష్యంపై కళ్లకు కట్టినట్లు చూపించారు. వివరాల్లోకి వెళ్లితే.. సోమాజిగూడ డివిజన్‌లోని ఒక కాలనీలో పేరుకపోయిన చెత్తను తొలగించాలని కార్పొరేటర్ వనం సంగీత భర్త శ్రీనివాస్‌యాదవ్ గత రెండు రోజుల కితం జీహెచ్‌ఎంసీ అధికారులను కోరుతున్నారు. చివరికి డిప్యూటీ కమిషనర్ కూడా అక్కడి వచ్చి పరిశీలించారు.కానీ నేటివరకు చెత్త తొలగించకపోవడంతో శ్రీనివాస్ చెత్త డంప్‌లో కుర్చీ వేసుకుని కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్తే ఇలా నిరసన వ్యక్తం చేస్తే సాధారణ ప్రజలు మాట అధికారులు ఎక్కడ పట్టించుకుంటారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి చెత్తలో కూర్చొని వాసన భరించిన శ్రీనివాస్‌యాదవ్ నిరసనకు ప్రజల నుంచి కూడ మద్దతు లభించింది. భవిష్యత్తులో ప్రజల ఇతర సమస్యలపై కూడా ఆయన ప్రభుత్వంతో పోరాటం చేయాలని కోరుతున్నారు.

Corporator’s husband protest against GHMC officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News