Sunday, January 19, 2025

ఓటరు జాబితాలో తప్పులుంటే సరిచేసుకోండి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: ఓటరు జాబితాలో తప్పులుంటే సరిదిద్దుకోవడంతో పాటు ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటు హక్కును నమోదు చేసుకొనేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ కోరారు. శుక్రవారం కేబీఆర్ పార్క్ లో ఏర్పాటుచేసిన ఓటర్ నమోదు క్యాంపెయిన్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పార్క్ లో వాకింగ్ చేస్తున్న వాకర్స్‌తో కాసేపు ముచ్చటించినకమిషనర్ మీకు ఓటు ఉన్నదా ఉంటే ఏమైనా తప్పులు గాని ఉంటే సవరించుకోవాల్సిందిగా సూచించారు. ఇందుకు వెబ్ సైట్ https://voters.eci.gov.in/ ద్వారా గాని voter helpline app download చేసుకుని ఫారం-8 ద్వారా సవరించుకోవచ్చాని తెలిపారు. అక్కడికక్కడే వాకింగ్ చేస్తున్న మహిళ వాకర్‌తో ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌ను డౌన్లోడ్ చేయించి పరిశీలన చేయించారు.

అక్టోబర్ 31వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ముందస్తుగా ఓటరు నమోదు చేసుకోవచ్చని వివరించారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడంతో పాటు అర్హత గల వారందరూ ఓటరు జాబితాలో నమోదు చేయాలనే లక్షంగా ఓటర్ నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో మేజర్ పార్క్ లు, థీమ్ పార్క్‌లు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఓటరు నమోదు అవగాహనతో పాటు ఫారం-8, ఫారం-6 దరఖాస్తులను ఎలా పూర్తి చేయాలో వివరిస్తారని తెలిపారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల పేర్లు వివిధ పోలింగ్ స్టేషన్‌లలో ఉన్నా, మిస్ మ్యాచ్ ఫోటోలు (పురుషుల ఫోటో స్థానంలో స్త్రీల ఫోటో, ) ఉన్నా, ఓటరు జాబితాలో సక్రమంగా లేని ఫోటోలు (ఆధార్ కార్డ్, సర్టిఫికేట్, రేషన్ కార్డ్, ఫోటో తలక్రిందులుగా, అస్పష్టంగా ఫోటోలు ఉండడం, సరైన డోర్ నంబర్, చిరునామా, పేరులో స్పెల్లింగ్ మిస్టేక్, పుట్టిన తేదీ, కుటుంబ సభ్యుల రిలేషన్ (తల్లి, తండ్రి, భార్య, భర్త, కుమారుడు, కూతురు,) పేరు లాంటి తప్పులు దొర్లితే సవరించుకోవచ్చాన్నారు. అంతేకాకుండా ఓటర్ లిస్ట్ లో తమ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడం.

మీ దగ్గర ఓటర్ కార్డు ఉన్నా కూడా పేరు ప్రస్తుత ఓటరు జాబితాలో లేకుంటే వెంటనే ఫారం-6 ద్వారా దరఖాస్తుచేసువచ్చాన్నారు. మీ నియోజకవర్గంలో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉన్నా, సరిచేసుకుకోవడంతో పాటు ఆధార్ నెంబర్ ను కూడా ఓటరు జాబితాలో ఫారం-6 బి ద్వారా అనుసంధానం చేసుకోవచ్చాని వెల్లడించారు. కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, జాయింట్ కమిషనర్ మంగతాయారు డి సి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News