Monday, December 23, 2024

అత్యధిక ‘అవినీతి’ ఫిర్యాదులు కేంద్ర హోంశాఖపైనే: సివిసి నివేదిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా హోం మంత్రిత్వశాఖ లోనే వచ్చాయని వెల్లడైంది. తర్వాతి స్థానాల్లో భారతీయ రైల్వే, బ్యాంకులు ఉన్నాయని తేలింది. గత ఏడాదిలో వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సివిసి) నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలో అన్ని విభాగాలకు సంబంధించి గత ఏడాది మొత్తం 1.15 లక్షల ఫిర్యాదులు వచ్చినట్టు సీవీసీ నివేదిక వెల్లడించింది. వీటిలో 85,437 ఫిర్యాదులు పరిష్కరించగా, మరో 29 వేలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.న ఇందులో 22 వేల ఫిర్యాదులు మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నట్టు సివిసి పేర్కొంది.

గత ఏడాది వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో అత్యధికంగా 43,643 హోం మంత్రిత్వశాఖ ఉద్యోగుల పైనే వచ్చాయి. రైల్వేల్లో 10,850 బ్యాంకుల్లో 8129 ఫిర్యాదులు వచ్చినట్టు సీవీసీ నివేదిక తెలియజేసింది. ఢిల్లీ ప్రాంతంలోని ఉద్యోగులపై 7370 ఫిర్యాదులు రాగా, వీటిలో ఎక్కువగా ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలోనే ఉన్నాయి. ఇక బొగ్గు మంత్రిత్వశాఖ లోని ఉద్యోగులపై 4304, కార్మికశాఖలో 4236, పెట్రోలియం శాఖ ఉద్యోగులపై 2617 ఫిర్యాదులు వచ్చాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌లో 2150 , రక్షణ శాఖలో 1619 ఫిర్యాదులు వచ్చాయని సీవీసీ నివేదిక వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News