Friday, March 21, 2025

ఆర్థికశాఖలో అవినీతి వెబ్

- Advertisement -
- Advertisement -

అర్హత లేని కంపెనీకి ఆర్థికశాఖ వెబ్‌సైట్ బాధ్యతలు 2018 నుంచి సుమారుగా వెయ్యి
కోట్ల్లు ధారాదత్తం…! టెండర్ లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండానే అప్పగింత ప్రైవేటు
సర్వర్‌లో ఉద్యోగుల డేటా ప్రతిరోజు టెక్నికల్ సమస్యలతో ఉద్యోగుల ఇబ్బందులు

మన తెలంగాణ/హైదరాబాద్ : అర్హత లేని కంపెనీకి కొందరు అధికారులు వేల కోట్ల రూపాయలను అప్పనంగా కట్టబెడుతున్నారు. కొందరు ఆర్థిక శాఖ అధికారుల నిర్లక్షం, అవినీతి వల్ల ప్రభుత్వ సొమ్మును ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ చెల్లించాల్సి వస్తోంది. ఈ దోపిడీ 2018 నుంచి యథేచ్ఛగా జరుగుతోంది. అయినా ఇ ప్పటివరకు ఆ కంపెనీ దోపిడీ మాత్రం ఆగడం లేదు. ఆ కంపెనీకి ఎలాంటి టెండర్ లేకుండా అప్పటి ప్రభుత్వం అనుమతి లేకుండానే టెండర్‌ను అప్పగించి అప్పనంగా ప్రభుత్వ సొమ్మును కట్టబెడుతుండడం విశేషం. కాం గ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023లో అధికారంలోకి వ చ్చిన తరువాత 2024 జనవరిలో ప్రస్తుత ప్రభుత్వ అ నుమతి లేకుండానే ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అ ధికారులు ఇదే సంస్థకు సుమారుగా రూ.14 కోట్లను చెల్లించడం విశేషం. ఇలా 2018 నుంచి 2025 వరకు సుమారుగా అప్పనంగా రూ. 1,000 కోట్లను ఈ సంస్థ కు కట్టబెట్టడం విశేషం. ఆర్థిక శాఖ సాఫ్ట్‌వేర్ కార్యకలాపాలను 1993 నుంచి 2017 వరకు గుడ్ గవర్నెన్స్ చూసేది. దీనికి గాను గుడ్ గవర్నెన్స్‌కు సుమారుగా కోటి రూపాయలను సంవత్సరానికి చెల్లించేది.

ఆర్థికశాఖకు సంబంధించి చెల్లింపులు, ఉద్యోగుల వివరాలను ఎప్పటికప్పుడు గుడ్ గవర్నన్స్ ప్రభుత్వ సర్వర్‌లో నిక్షిప్తం చేసేది. అయితే, కొందరు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ సొమ్మును దోచేయడానికి తెరపైకి ఓ ప్రైవేట్ సంస్థను తీసుకొచ్చారు. ఆర్థిక శాఖ సాఫ్ట్‌వేర్ కార్యకలాపాలను ఈ సంస్థ చూసుకునేలా బాధ్యతలను అప్పగించారు. అయితే టెండర్ లేకుండానే ఈ సంస్థకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించడం తో పాటు కనీసం కేబినెట్ ఆమోదం లేకుండా, థర్డ్‌పార్టీ ఆడిట్ లేకుండానే ఆర్థిక శాఖకు సంబంధించి ని ర్వహణ బాధ్యతలను ఈ సంస్థకు అప్పగించినట్టు ఆ రోపణలు వినిపిస్తున్నాయి. గతంలో గుడ్ గవర్నెన్స్‌కు సంవత్సరానికి కోటి రూపాయలు చెల్లించిన ఫైనాన్స్ శాఖ ఈ సంస్థకు మాత్రం సంవత్సరానికి రూ.100 నుంచి రూ.120 కోట్లు చెల్లించడానికి ముందుకురావ డం విశేషం దీంతోపాటు ఈ సంస్థ డేటాను ప్రభుత్వ స ర్వర్‌లో కాకుండా అమెజాన్ సర్వర్‌లో భద్రపరచడాని కి అదనంగా రూ.10 నుంచి రూ.20 కోట్లను ఈ సం స్థకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు 2018 నుంచి చెల్లిస్తుండడం విశేషం. అయితే, టెండర్ లేకుండానే బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ 2018లో కనీసం ట్రయల్న్ చేయకుండానే డైరెక్ట్‌గా ఈ బాధ్యతలను చేపట్టింది.

దీంతో 2018 నుంచి ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఆన్‌లైన్ సమస్య తలెత్తడం, ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ డబ్బులు, పిఎఫ్ డబ్బులు చెల్లింపులకు ఇబ్బందులు తలెత్తుతుండడం విశేషం. ఈ ఆన్‌లైన్ సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే ఆయా ఎస్‌టిఓ, డిటిఓ, ట్రెజరీల్లో పనిచేసే అధికారులు ప్రైవేట్ సంస్థలో పనిచేసే సిబ్బందికి ఫోన్ చేస్తే ఆ సమస్య వెంటనే పరిష్కారం కాకపోవడంతో పాటు రెండు, మూడు రోజులు నిరీక్షించాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఇలా టెక్నికల్ సమస్యలు ప్రతిరోజు వస్తున్నాయని ఒకసారి వచ్చిన టెక్నికల్ సమస్య మరోసారి రాకుండా ఆ సంస్థ చర్యలు చేపట్టడం లేదని ఇలా ఎనిమిది సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2018కి ముందు డిటిఓలకే అథారిటీ
2018 సంవత్సరానికి ముందు గుడ్ గవర్నెన్స్ ఈ బాధ్యతలు చూసేటప్పుడు ఎస్‌టిఓ, డిటిఓ, ట్రెజరీల్లో బిల్లులు వెంటనే పాస్ అయ్యేవి. 2018 నుంచి ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి బిల్లులు పాస్ కావడానికి ఉద్యోగులు, కాంట్రాక్టర్‌లు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2018 నుంచి బిల్లులు పాస్ కావాలంటే సచివాలయంలోని ఆర్థికశాఖ చుట్టూ ఉద్యోగులు, కాంట్రాక్టర్‌లు, ప్రజలు తిరగాల్సి వస్తోంది. అప్పటి నుంచి ఆర్థికశాఖలోని కొందరు అధికారులు 4 శాతం కమీషన్ తీసుకొని ఈ బిల్లులను పాస్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈతతంగం అంతా ఆర్థికశాఖలోని ఓ ముఖ్య అధికారి కనుసన్నల్లోనే నడుస్తుందని,

ఆయన దగ్గర పనిచేసే కొందరు అధికారులు కమీషన్‌ల పేరుతో కోట్లను దండుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో పనిచేసే ఎస్‌టిఓ, డిటిఓ కార్యాలయాలతో పాటు ట్రెజరీ, ఆర్థికశాఖలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు కూడా తమకు రావాల్సిన పిఎఫ్, జిపిఎఫ్, సరెండర్ లీవ్ డబ్బుల కోసం ఆర్థికశాఖలో పనిచేసే కొందరు అధికారుల చుట్టూ తిరగాల్సి రావడం విశేషం. అయితే, ప్రైవేట్ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించడం వల్లే తమకు ఈ దుస్థితి తయారయ్యిందని ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా శాఖల ఉద్యోగులు, అధికారుల దుస్థితి అధ్వానంగా ఉందని వారు వాపోతున్నారు.

2022 నుంచి డేటా బ్యాకప్ లేకుండానే….
దీంతోపాటు అన్ని శాఖల ఉద్యోగుల, అధికారుల, సిబ్బంది డేటాను ప్రైవేట్ సంస్థ అమెజాన్ క్లౌడ్‌లో భద్రపరుస్తుండడంతో డేటా అంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఈ సంస్థ నుంచి డేటా బ్యాక్ అప్ తీసుకోవాల్సిన ఆర్థికశాఖ దీని గురించి పట్టించుకోకపోవడం లేదని 2022 నుంచి ఆ డేటాను తీసుకోవడానికి ఆర్థికశాఖ ఆసక్తి చూపడం లేదని, దీంతో ఆర్థికశాఖ వద్ద కూడా 2022 నుంచి డేటా అందుబాటులో లేదని తెలుస్తోంది.

డైరెక్ట్‌గా టోకెన్‌లు జారీ చేస్తున్న సదరు ప్రైవేట్ సంస్థ
కొన్నిసార్లు సదరు ప్రైవేట్ సంస్థ జీతాలు, బిల్లులకు సంబంధించి డైరెక్ట్‌గా టోకెన్‌లు జారీ చేయడం, పాస్ చేయడంపై ఏజి ఆడిట్ కూడా అభ్యంతరం చెప్పింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సైతం ఏజి ఆడిట్ ఫిర్యాదు చేసింది. అసలు టోకెన్‌లు జారీ చేయడం, బిల్లులు పాస్ చేయడం ట్రెజరీ శాఖ చూడాల్సిన బాధ్యతలను ప్రైవేట్ సంస్థ చూడడంపై ఆ శాఖ ఉద్యోగులు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇలా ఆర్థికశాఖలో జరుగుతున్న ఈ అవినీతి, కొందరు ఉద్యోగులు కమీషన్‌ల పేరుతో దండుకున్న వందల కోట్ల రూపాయల గురించి ఈ మధ్య సిఎంఓకు ఆధారాలతో ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News