Wednesday, January 22, 2025

అవినీటిపారుదల అధికారులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అక్కడ ఉద్యోగులు పరస్పరం సహకరించుకుంటూ అవినీతి అక్రమ సంపాదనలలో కోట్లకు పడగలెత్తారు. పైకి చూసేందకు అదో చిన్న ప్రభుత్వ సంస్థ. కాని అక్కడ జరుగుతున్నది మాత్రం వేల కోట్ల పనులు .వ్యవసాయరంగంలో ఎండనకా వాననకా ప్రకృతి వైపరిత్యాలకకు ఎదురొడ్డి పంటలు పండిస్తున్న రైతులకు సాయ పడాలన్న ఉద్దేశంతో ఆ సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పొలాలో వ్యవసాయ బావులు ఎండిపో యి.. పంటలు కాపాడుకోలేని పరిస్థితులో ఆ బావులు పూర్తిగా పాడుబడి పో కుండా వాటిలో బోర్లు వేసి తిరిగి నీటివూటను పెంపోందించి రైతుకు చేయూత నివ్వాలన్న లక్షంతో ప్రభుత్వం తెలంగాణ అవినీటిపారుదల అధికారులు సహకార గ్రామీణ నీటిపారుదల సంస్థను ఏర్పాటు చేసింది.అయితే అందులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు అవినీతి రుచిమరిగి దాన్ని అవినీతిపారుదల సంస్థగా మార్చుకున్నారు. ఆ సంస్థకు చెదిన కీలక స్థానంలో ఉన్న అధికారిని తమ అక్రమాలు కొమ్ముకాసేలా చేసుకుని యధేశ్చగా అవినీతికి పాల్పడుతున్నట్టు తెలిసింది.

గ్రామీణ నీటిపారుదల సంస్థ అసలు లక్ష్యాలు ఏనాడో కరుమరుగైపోయాయి. ఇప్పుడు ఆ సంస్థ ఉద్యోగులు ఇతర శాఖల పనులు చేస్తున్నారు. ఏటా వేలకోట్ల విలువైన సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల పనులు చేయిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను అవకాశంగా మలుచుకున్నారు. అనుకూలమైన వారికి అమ్యామ్యాలు అందజేసి కలెక్టర్ల ద్వారా ఈ పనులకు నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. ఇందులో పనిచేసే ముగ్గురు అధికారులు తమ బాస్‌ను అవినీతికి జేమ్స్‌బాండ్‌గా మార్చేసుకున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ అధికారి సారధ్యంలోనే వీరి అవినీతి తెలంగాణకే పరిమితం కాలేదు.తెలుగు రాష్ట్రాలను కూడ దాటి మళయాల రాష్ట్రానికి కూడా పాకిపోయింది. కేరళ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పధకం కింద ఈ అవినీతి అధికారుల ముఠా పనులు చేస్తోంది. తెలగాణ ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా పక్కరాష్ట్రాల్లో పనులు చేయడం నేరం అని తెలిసికూడా వీరు ఏడాదిన్నర కాలంగా అక్కడ వందల కోట్ల విలువైన పనులు చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ అడ్డదారిలో ఈ పనులకు కూడా బినామి కాంట్రాక్టు ఏజెన్సీలను శృష్టించుకున్నారు.ఆర్‌ఎస్ ఇంజనీరింగ్ ,పద్మావతి ఇన్‌ఫ్రా , జిఎన్‌వి ఇంజనీరింంగ్ సర్వీస్ పేర్లతో ఏజెన్సీలను శృష్టించుకున్నారు.

బినామి కంపెనీలకు అడ్వాన్సులు
ప్రైవేటు ఏజెన్సీలకు ప్రభుత్వ నిధులు అడ్వాన్సుగా ఇవ్వటం నేరం అని తెలిసి కూడా ప్రభుత్వ అనుమతి తీసకుకోకుండానే బినామి కంపెనీలకు గ్రామీణ నీటిపారుదల సంస్థ నుంచి కోట్ల రూపాయలు అడ్వాన్సులు చెల్లించారు. కనీసం ఈ బినామి ఏజెన్సీల నుంచి బ్యాంకు గ్యారేంటీలు కూడా తీసకోలేదని సమాచారం. ఇప్పటికే ఆర్‌ఎస్ ఇంజనీరింగ్‌కు రూ.6.90కోట్లు , పద్మావతి ఇన్‌ఫ్రాకు రూ.4కోట్లు , జిఎన్‌వికి కూ.2కోట్లు అడ్వాన్సులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కంపెనీలు చేతులెత్తేస్తే నీటిపారుదల సంస్థ ఇచ్చిన అడ్వాన్సు నిధులు నీటిపాలైనట్టే .

తక్కువ రేట్లకు కొని భారీగా బిల్లులు
సంస్థకు చెందిన ఆ ముగ్గురు ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ముద్రను వాడేసుకుని కేరళ జల్‌జీవన్ మిషన్ పనులను తమ బినామి ఏజెన్సీలకు కట్టబెట్టించుకున్నారు.వీటికి కనీసం టెండర్లు ప్రక్రియ కూడా నిర్వహించలేదు. మిషన్ పనుల్లో అవసరమైన జిఐ పైపులు ,పివిసి పైపులు ఇతర మెటిరియల్‌ను కొన్ని కంపెనీల నుంచి కారు చౌక ధరలకు నాశిరకానివి కొని , అదే వాటికి అధిక మొత్తంలో బిల్లులు వేయించి సోమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులు సిసి రోడ్లు , డ్రైన్లలో నాశిరకం పనులు చేసి రాజకీయ పలుకుబడితో భారీగా సోమ్ము చేసుకున్నట్టు సమాచారం. ఏ సంస్థలోనైనా చేసిన పనులకు ఆడిట్ జరగాల్సిందే . అయితే గ్రామీణ నీటిపారుదల సంస్థలోని ఆ ఉద్యోగులు తాము చేయించిన పనులకు వారే ప్రవేటు వ్యక్తుల ద్వారా ఆడిట్ రిపోర్టులు తమకు అనుకూలంగా చేయించి ఆడిట్ అధికారుల చేతులు తడిపి రిపోర్టులకు మమ అనిపిస్తున్నారని ఆరోపణలు వున్నాయి.

తమ బాస్‌గా మళ్లీ ఆ ఆధికారే కావాలి:
తెలంగాణ సహకార గ్రామీణ నీటిపారుదల సంస్థకు ఎండిగా ఉన్న అధికారిని కొనసాంగించుకుకునేందుకు కోసం ఈ సంస్థలోని ముగ్గరు ఉద్యోగులు ఉన్నత స్థాయిలో చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. పరిశ్రమల శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న ఈ అధికారి 2012నుంచి 2015వరకూ డిప్యూటేషన్‌పై నీటిపారుదల సంస్థ ఎండిగా పనిచేశారు. మళ్లి అదే ఆధికారి 2022లో రెండవ సారి ఎండిగా డిప్యూటేషన్‌పై వచ్చారు. ఈ నెల చివరన ఈ అధికారి రిటైర్టు కావాల్సివుంది. ఈ అధికారి విధి నిర్వహణలో చార్జెస్ పడ్డాయి. ఇవి ఇంకా విచారణ దశలోనే ఉన్నట్టు సమాచారం . రిటైర్‌మెంట్ ఆర్డర్స్‌లో చార్జెస్ పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అధికారినే మళ్లీ ఎండిగా కొనసాగించుకునేలా ఆ ముగ్గురు అధికారులు చేస్తున్న విశ్వప్రయత్నాల వెనుక దాగిన మర్మం గ్రామీణ నీటిపారుదల శాఖ కార్యాలయంలో గుప్పుమంటోంది. నీటిపారుదల శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు , అవకతవకలపై ఇప్పటికే విజిలెన్స్ కూడా కన్నేసినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News