Sunday, December 22, 2024

కోట్లలో కొట్టేశారు!

- Advertisement -
- Advertisement -

పచ్చదనం పేరుతో … పంచుకుతిన్నారు, కర్నూలు కాంట్రాక్టర్ మాయజాలం, మొక్కలు లేకుండానే మెక్కేశారు, తలాపాపం తలాపిడికెడు, మున్సిపల్ అధికారులకు కూడా కమీషన్లు ?, కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ నిలదీసినా చర్యలు శూన్యం పెండింగ్ బిల్లుల కోసం అధికారులకు వల వేసిన కాంట్రాక్టర్ ! పెండింగ్ పెడతారా ? చెల్లిస్తారా ?

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో:  పాలమూరు అభివృద్ధిలో భా గమైన అందమైన పచ్చదనం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.మున్సిపల్ అధికా రులు, మొక్కలు పెంచిన కాంట్రాక్టర్ కలిసి లక్షల్లో దొబ్బేశారు. తిలాపాపం తలాపిడెకెడు అన్న చందంగా పచ్చదనం మాటున మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్ అంది నకాడికి జేబుల్లో వేసుకున్నారు. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు. ఏకంగా గత కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ కౌ న్సిల్ సమావేశంలో గతంలోని బిఆర్‌ఎస్ కౌన్సలర్ ( ఇప్పుడు కాంగ్రెస్) ఆనంద్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో మొక్కల పెంపకం మాటున జరిగిన అవినితీ, అక్రమాలపై వి చారణ చేపట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. స్వయం గా మున్సిపల్ కమీ షనర్, జాయింట్ కలెక్టర్ ( స్దానిక సంస్థ లు) ఎదుటనే ఆరో పించారు. వాస్తవ విషయానికి వస్తే పాల మూరు, భూత్పూర్, జడ్చర్లకు ఆనుకొని లింక్‌తో ఉన్న జాతీ య రహదారులు ,బైపాస్ రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటేం దుకు ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించింది.

Corruption in mahaboobnagar

అయితే ఈ టెండర్లను కర్నూలుకు చెందిన ఒక కాంట్రాక్టర్‌కు దక్కి ంచుకున్నారు.సుమారు 18 కోట్లకు పైగా టెండర్లకు దక్కిం చుకున్నట్లు సమాచారం. ఈ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వ ంవి కొంత నిధులు అయితే, మున్సిపల్ నిధుల నుంచి కొంత నిధులు కలిపి ఈ మొక్కలు నాటే ప్రక్రియ కొనసాగింది. పచ్చదనం పరిశుభతతో పాటు మున్సిపాల్టీలు అందంగా కని పించాలని, ఆహ్లాదకరమైన వాతావరం ఉండాలని, కాలుష్యం లేని నగరాలుగా రూ-పుదిద్దుకోవాలని సంకల్పంతో ఈ నిధుల ను పచ్చదనానికి ఖర్చు పెడతారు. పాలమూరు మున్సిపాల్టీ లోని టౌన్‌తో పాటు రోడ్లు మధ్యలోను, రోడ్లకు ఇరువైపులా కూడా నిర్ణయించిన ధరకే నాటాల్సి ఉంటుంది. ఎవరైతే టెండ్ల రు దక్కించుకుంటారో, నాణ్యమైన మొక్కలు నాటడంతో పా టు వారిసంరక్షణ కూడా ఐదేళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటు ంది.

 

కానీ ఇక్కడి కర్నూలుకు చెందిన కాంట్రాక్టర్ గతంలో ప్రజాప్రతినిధిలో చేతిలో కీలు బొమ్మలా మారి అందిన కాడికి దో చుకున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చెట్లు ఒక రేటు ఉంటే వాటికి డబుల్ ధరలు బిల్లులు పెట్టుకొని దోచుకున్నట్లు తెలుస్తోంది. ఇలా లక్ష కాదు, రెండు లక్షలు కాదు ఏకంగా కోట్లలో దోచుకుతిన్నట్లు తెలుస్తోంది. ఇందు లో ప్రజాప్రతినిధులతో పాటు మున్సిపల్ అధికారులకు కూడా ఈ అవినీతి పాపంలో చేతు లు తడిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచార ం. మొక్కలు నాటినట్లే నాటి, తిరిగి వాటిని తొలగించడం, తిరిగి మున్సిపల్ నిధుల కింద తిరిగి మొక్కలు నాటడం వంటి పెద్ద చింతామణి డ్రామాలు సృష్టించి నిధులను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై గతంలో బిఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లకు తెలిసినా వారు ధైర్యంగా ఎదురించే సాహసం చేయలేక పో యారు. వారి నోళ్లకు తాళాలు పడడంతో వారి ఈ వ్యవహారంపై చూసి చూడనట్లు ఉండిపోయారన్న విమర్శలు ఉన్నాయి.దీంతో ఈ కాంట్రాక్టర్, అధికారులు కలిసి పంచుకుతిన్నారన్న చర్చ జరుగుతోంది.

పెండింగ్ బిల్లుల కోసం వల…

ఇంకా పెండింగ్ బిల్లులు కొంత రావాల్సి ఉండడంతో మున్సిపల్ అదికారులకు మేనేజ్ చేసుకునేందుకు సంబందిత కాంట్రాక్టర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సంబందిత అదికారులు గతంలోనే ఈ వ్యవహారంలో అవినీతి మరక ఉండడంతో ఈ బిల్లులు కూడా చేసి ఇస్తారని భావిస్తున్నాడు. టెండర్ ప్రక్రియ గడువు కూడా ముగిసి పోవడంతో ఇక్కడి నుంచి ఉడాయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులను మేనేజ్ చేసుకుంటే మరో ఐదేళ్ల పాటు మెయింటెన్ కాంట్రాక్టర్‌గా ఉండేందుకు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలా చోట్ల మొక్కలు మెయింటెన్ లేక పోవడంతో ఇప్పటికే అనేక చెట్లు చనిపోతున్నాయి. ఇదిలా ఉండగా మన్యం కొండ వెళ్లే రహదారిలో మొక్కలు నాటకుండానే బిల్లులు డ్రా చేసుకున్నట్లు సమాచారం.

ఆనంద్ గౌడ్ ఆరోపణలపై విచారణ చేస్తారా ?

ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలరే అనంద్ గౌడ్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ మొక్కల అవినీతిపై ఆరోపణలు చే సిన నేపథ్యంలో వీటిపై విచారణ చేయిస్తారా లేక ఇంతటితోనే మూసివేస్తారా అన్న చర్చ జరుగుతోంది. కొంతమంది కౌన్సిలర్లు సంబందిత కాంట్రాక్టర్ లైసన్స్‌ను రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అక్రమంగా తేలితే అతనిని నుంచి తిరిగి నిధులు రాబట్టాలని కోరుతున్నారు. అయితే ఇందులో పూర్తి విచారణ జరిగితే కోట్లలో అవినీతి బయట పడే అవకాశం ఉంది.
వివరాలు ఇస్తానని, మాయమాటలు..

గత రెండు రోజలుగా సంబందిత కాంట్రాక్టర్‌కు వివరణ కోసం మన తెలంగాణ ప్రయత్నించగా, వివరణ ఇస్తానని, వివరాలు ఇస్తానని చెప్పిన కాంట్రాక్టర్ గత మూడు రోజుల నుంచి ఫోన్ లేపక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎక్కడ తమ అవినీతి బయటికి వస్తుందో అన్న అనుమానంతోనే మా నెంబర్‌ను కలవకుండా చేయడంతో అవినీతిపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News