Friday, January 10, 2025

క్రికెట్ క్లబ్‌లో అవినీతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్లబ్ క్రికెట్ ఆడేందుకు ప్లేయర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన క్రికెట్ క్లబ్ ఓనర్లపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లబ్ తరఫున ఆడాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని చార్మినార్ సిసి క్లబ్ ఓనర్ డిమాండ్ చేశారు. క్లబ్ తరఫున ప్లేయర్‌గా తీసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని చెప్పాడు. దీంతో ప్లేయర్ పోలీసులను ఆశ్రయించాడు, దీంతో విషయం బయటపడింది. క్లబ్ యజమాని, అతడి కుమారుడిపై కేసు నమోదు చేసిన చార్మినార్ పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. క్లబ్‌లో ఆడేందుకు కళ్యాణ్ అనే క్రీడాకారుడు లక్ష రూపాయలు చెల్లించినట్లు తెలిసింది. మూడు మ్యాచ్‌లు ఆడిస్తానని క్లబ్ యజమాని చెప్పినట్లు తెలిసింది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కెరీర్ తొలినాళ్లలో ఈ క్లబ్ తరఫున ఆడాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News