Wednesday, November 6, 2024

వ్యాపార వ్యయం ఆందోళనకరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వ్యాపార వ్యయం పెరుగుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తయారీ రంగం కార్యకలాపాలు మెరుగ్గానే ఉండనున్నాయని ఇండస్ట్రీ చాంబర్ ఫిక్కీ సర్వే పేర్కొంది. తాజా త్రైమాసిక సర్వే(క్యూ2) ప్రకారం, తయారీ రంగం, పరిశ్రమకు ఉత్పత్తి ఖర్చు ఎక్కువైంది. సర్వేలో పాల్గొన్న వారు చాలామంది వ్యాపార ఖర్చులు పెరిగాయని ముక్తకంఠంతో చెప్పారు. భద్రతా ప్రమాణాలు, లాక్‌డౌన్ వాల్యూమ్‌లో క్షీణత వల్ల వ్యాపార వ్యయం పెరిగింది. తక్కువ సామర్థం వినియోగం, అధిక చార్జీలు, ఇతర లాజిస్టిక్ ఖర్చులు, రా మెటీరియల్ వ్యయం, వడ్డీ రేట్లు పెరగడం వంటి కారణాలు కూడా ఉన్నాయి. క్యూ1 (202122 ఏప్రిల్‌జూన్)లో గణాంకాలు చూస్తే వచ్చే రెండో త్రైమాసికం (జూలైసెప్టెంబర్)లోనూ గణనీయమైన మెరుగుదల ఉండనుందని ఫిక్కీ తెలిపింది. వ్యాపారం, ఉత్పత్తి వ్యయం పెరిగాయని సర్వేలో ఎక్కువ మంది చెప్పారు.

రెండో త్రైమాసికంలో తమ ఎగుమతులు పెరగనున్న కారణంగా మెరుగుదల ఉంటుందని 58 శాతం మంది ఆశిస్తున్నారు. అయితే ఉద్యోగుల నియామకం మందకొడిగానే ఉంది. సర్వేలో 68 శాతం మంది వచ్చే మూడు నెలల్లో అదనంగా ఎలాంటి ఉద్యోగ నియామకాలను చేపట్టడం లేదని తెలిపారు. ఫిక్కీ సర్వేలో 11 కీలక రంగాలు ఆటోమోటివ్, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, సెరామిక్స్, కెమికల్స్, ఫర్టిలైజర్స్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, మెటల్ అండ్ మెటల్ ఉత్పత్తులు, పేపర్ ప్రొడక్ట్, టెక్స్‌టైల్స్, టెక్స్‌టైల్స్ మెషినరీ, టాయ్స్ అండ్ మిస్కలేనియస్ వంటివి ఉన్నాయి. వార్షికంగా 2.7 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ కల్గిన చిన్న, భారీ సంస్థలు, అంటే దాదాపు 300 తయారీ యూనిట్ల నుంచి ఈ అభిప్రాయాలను ఫిక్కీ సమీకరించింది.

Cost of doing business rising in India: FICCI Survey

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News