Monday, January 13, 2025

ఈ శునకం ఖరీదు రూ.20 కోట్లు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్! బెంగళూరుకు చెందిన ప్రముఖ డాగ్ బ్రీడర్, క్యాడబామ్స్ కెన్నెల్ యజమాని సతీష్ అత్యంత అరుదైన ఒక జాతి శునకాన్ని హైదరాబాద్‌లో రూ. 20 కోట్లకు కొనుగోలు చేశారు. అత్యంత నాణ్యమైన, ఖరీదైన శునకాలను పెంచే సతీష్ ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి ఈ అరుదైన కాకసియన్ షెపర్డ్ బ్రీడ్‌ను కొనుగోలు చేసినట్లు మీడియా కథనాలు తెలిపాయి. ఆర్మేనియా, సర్కాసియా, టర్కీ, అజర్‌బైజాన్, డగిస్తాన్, జార్జియా వంటి దేశాలలో ఈ జాతి జాగిలం లభిస్తుంది. తన వద్ద కాకిసయన్ షెపర్డ్ బ్రీడ్‌కు చెందిన జాగిలం ఉన్నట్లు హైదరాబాద్‌కు చెందిన బ్రీడర్ ఇండియా డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి తెలియచేయగా ఆయన ఆ విషయాన్ని బెంగళూరుకు చెందిన డాగ్ బ్రీడర్ సతీష్‌కు తెలిపారు. ఆ జాగిలాన్ని కొనుగోలు చేయడానికి సతీష్ ఆసక్తి కనబరచడంతో హైదరాబాద్ బ్రీడర్ దాన్ని రూ. 20 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఆ ఏడాదిపైన ఐదు నెలల వయసున్న ఆ జాగిలానికి క్యాడబమ్ హైడర్ అని సతీష్ పేరు పెట్టారు.
కాకసస్ ప్రాంతానికి చెందిన ఈ జాతి జాగిలం గొర్రెల మందకు కాపలాగా వ్యవహరించడంలో దిట్టగా పేరు సంపాదించుకుంది. తోడేళ్లను వేటాడడంలో ఇవి ఆరితేరినవి. గొర్రెలు, ఇతర పశు సంపదను కాపాడేందుకు ఈ జాతి జాగిలాన్ని ఆ దేశాలలో ఎక్కువగా వినియోగిస్తారు. రష్యాలో ఈ జాతి జాగిలాలను జైళ్ల కాపలాకు కూడా ఉపయోగిస్తారు. 45 నుంచి 70 కిలోల వరకు బరువుండే ఈ జాగిలాలు 10 నుంచి 12 ఏళ్లపాటు జీవిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News