Wednesday, January 22, 2025

మహిళా కానిస్టేబుల్‌తో మహిళా ఎస్‌ఐ మసాజు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: డ్యూటీలో ఉండగా పోలీసు స్టేషన్‌లోనే ఒక మహిళా కానిస్టేబుల్ చేత మసాజు చేయించుకున్నందుకు ఉత్తర ప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఒక మహిళా పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా కానిస్టేబుల్ చేత మసాజు చేయించుకుంటూ మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ మునీత సింగ్ సిసిటివి కెమెరాకు చిక్కారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ సంఘటనపై శాఖపరమైన దర్యాప్తునకు ఎస్‌పి సౌరభ్ దీక్షిత్ ఆదేశాలు జారీచేశారు. ఈ వీడియో పాతదని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలిసింది. ఎస్‌హెచ్‌ఓతోసహా పోలీసు స్టేషన్‌లోని సిబ్బంది వేసవి యూనిఫారాలు ధరించినట్లు వీడియోలో కనపడింది.

ఈ వీడియోపై దర్యాప్తు జరుగుతున్నట్లు సిఐ అజిత్ కుమార్ చెప్పారు. 13 సెకండ్ల ఈ వీడియోలో ఎస్‌హెచ్‌ఓ కుర్చీలో కూర్చుని ఉండగా ఒక మహిళా కానిస్టేబుల్ ఆమె భుజాలకు మసాజు చేస్తున్న దృశ్యాలు ఇందులో కనిపించాయి. వీడియోలో మరో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ కూడా కనిపించారు. కాగా..లక్నోలోని ఠాకూర్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఒక పురుష సబ్ ఇన్స్‌పెక్టర్ ఒక మహిళా కానిస్టేబుల్ చేత మసాజు చేయించుకుంటున్న దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి గత ఏడాది బయటపడి సంచలనం సృష్టించింది.

 

Courtesy by Times now navabharat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News