Monday, January 13, 2025

నటుడు, నిర్మాత కాస్య్టూమ్ కృష్ణ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

చెన్నై: సీనియర్ నటుడు, నిర్మాత కాస్య్టూమ్  కృష్ణ నేడు కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేడు ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో జన్మించారు. చాలా సినిమాలకు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్ బంద్’ సినిమాతో నటుడిగా పరిచయ్యమయ్యారు. 1980 దశకంలో ఆయన అనేక మంది అగ్ర హీరోల సినిమాలకు కాస్య్టూమ్ డిజైనర్‌గా సేవలందించారు. ఆయన ‘పెళ్లి పందిరి’ సహా ఎనిమిది చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News