- Advertisement -
హైదరాబాద్: ఈ వ్యవసాయ సీజన్‌కు సంబంధించి పత్తికొనుగోలు కేంద్రాలు శనివారం నాటితో మూత పడనున్నాయి.రైతులు సిసిఐ సెంటర్లకు విక్రయానికి తెస్తున్న పత్తి నిల్వలు తగ్గిపోయినందున ఈ నెల 20నాటితో వాటిని మూసి వేయనున్నట్టు కాటన్ కార్పోరేషన్ ఇండియా ప్రకటించింది. కనీస మద్దతు ధరలకు పత్తిని కొనుగోలు చేసేందుకు సిసిఐ సెటర్లు నిర్వహిస్తున్నప్పటికీ బహిరంగ మార్కెట్‌లో
కనీస మద్దతు ధరలకంటే అధికంగానే ప్రైవేటు వ్యాపారులు పత్తికి ధర పెడుతుంటంతో సిసిఐ కేంద్రాలకు పత్తి రాక తగ్గిపోయింది. కేంద్రప్రభుత్వం పత్తిపంటకు కనీస మద్ధతు ధర క్వింటాలుకు సాధారణ రకానికి రూ.6080,పొడవు పింజెరకానికి రూ.6380 ధర ప్రకటించింది. అయితే మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.7550నుంచి7800 ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
- Advertisement -