Wednesday, January 22, 2025

15 వేలు గిట్టుబాటు ధర చెల్లించండి…

- Advertisement -
- Advertisement -

అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

 

ఆదిలాబాద్: వంద కిలోల పత్తికి రూ. 15000 మద్దతు ధర ప్రకటించాలని, సిసిఐ వాణిజ్య కొనుగోలు జరపాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పోచ్చారా ఎక్స్ రోడ్ వద్ద పత్తి రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష రైతు నాయకులు మాట్లాడారు. విదేశీ పత్తి దిగుబడిని ఆపాలని, ప్రతిరోజు వ్యాపారస్తులు సిసిఐ అధికారులు పారదర్శక టెండర్ నిర్వహించి వాణిజ్య కొనుగోలు జరపాలని, వ్యాపారస్తులతో కుమ్ముకైన సిసిఐ అధికారులను కఠినంగా శిక్షించాలని పత్తి రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని డిమాండ్ చేశారు.

ఈ రాస్తారోకో సందర్భంగా రోడ్డుకిరువైపులా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. నిరసన తెలిపిన రైతులను రైతు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగేపు బోర్రన్న, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బర్గూల మల్లేష్, మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు మహమ్మద్, బోథ్ యంపిటిసి షేక్ నాజర్ అహ్మద్, రాజశేఖర్, బిఆర్ఎస్ నాయకులు జి రాజేశ్వర్ రెడ్డి, సంజీవరెడ్డి, నేరడిగొండ మాజీ జడ్పిటిసి భీమ్ రెడ్డి, అనిల్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి అన్ని గ్రామాల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News