- Advertisement -
హైదరాబాద్: వస్త్ర పరిశ్రమకు పత్తి పంట మూలాధారమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని, ప్రపంచంలో నాలుగు రకాల పత్తిపంటల్లో 90 శాతం గాస్పియం, హిర్సూటం రకానికి చెందిందే అన్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో ఉన్న బేయర్ పత్తి విత్తన, జెన్యు పరిశోధన కేంద్రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ప్రపంచంలో అత్యధికంగా ఇండియాలోనే సుమారు 6.2 మిలియన్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని తెలిపారు. భారత్ తో పాటు చైనా, అమెరికాలలో పత్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుందన్నారు.
- Advertisement -