Friday, December 20, 2024

పత్తి రైతులు నిబంధనలు పాటించాలి

- Advertisement -
- Advertisement -
  •  అదనపు కలెక్టర్ కె. సీతారామరావు

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: జిల్లాలోని పత్తి రైతులు పత్తిని అమ్మే సందర్భంలో అధికారులు సూచించిన నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామ రావు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్ సిసిఐ, రవాణా శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023,24 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాల్‌కు రూ. 7వేల 20 కనీస మద్ధతు ధర ప్రకటించిందన్నారు.

సిసిఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని అమ్మకానికి తీసుకువచ్చేటప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ పాసు పుస్తకం, పట్టా పహాని జిరాక్స్ కాపీలను తీసుకురావాలని సూచించారు. పత్తిని బాగా శుభ్రపరిచి తేమ శాతం 8 నుంచి 12లోపు ఉండేటట్లు చూసుకోవాలన్నారు. జిన్నింగ్ మిల్లు యాజమాన్యాలు, సిసిఐ అధికారులు రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని సూచించారు.

అనంతరం వరి కొనుగోళ్లపై కూడా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు 230 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. డిఆర్‌డిఏ నుంచి 15 వరి కొనుగోలు కేంద్రాలు, పిఎస్‌ఈస్ నుంచి 215 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ గ్రేడ్ క్వింటాల్ వరికి రూ. 2203 మద్ధతు ధర, రెండో రకానికి క్వింటాల్‌కు రూ.2183 ఉన్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ నుంచి జరిగే వరి కొనుగోలుకు అన్ని ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంలో జయ కుమార్, సిసిఐ డిప్యూటి మేనేజర్ మార్కెటింగ్ అధికారిని బాలమని, ఆర్డిఓ ఎర్రిస్వామి, ఇంచార్జి డిఎస్‌ఓ స్వామి కుమార్, డిసిఓ ప్రత్యనాయక్, డిఆర్‌డిఏ పిడి నర్సింగ రావు, ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి, అధికారులు, జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News