Sunday, November 24, 2024

పెరగనున్న పత్తి సాగు

- Advertisement -
- Advertisement -

Cotton is likely to grow heavily during Vaanakalam season

వచ్చే సీజన్‌లో 70లక్షల ఎకరాలకు పైగా
సాగు చేయనున్నట్లు అంచనా

మన తెలంగాణ : రానున్న వానాకాలపు వ్యవసాయ సీజన్‌లో పత్తిసాగు భారీగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వం కూడా పంటల వైవిద్యీకరణను పెద్ద ఎత్తున ప్రొత్సహిస్తుండడం, దాంతో ఈ సీజన్‌లో సాగు చేసిన పత్తికి మార్కెట్‌లో అనూహ్యరీతిలో డిమాండ్ పెరిగిపోవడంతో రైతుల మనసు ఈ సారి పత్తివైపు లాగుతోంది. ఇప్పటినుంచే పతి విత్తనాల సేకరణపై దృష్టి సారిస్తున్నారు. దశాబ్ధాల తరబడి పత్తిసాగులో మునిగితేలుతున్న రైతులతోపాటు ఈ పంటసాగు అంతగా అలవాటు లేని కొత్త రైతులు సైతం పత్తి సాగుకు మొగ్గుతున్నారు. దీంతో ఈ సారి రాష్ట్రంలో పత్తిసాగు విస్తీర్ణం ప్రస్తుత ఏడాది కంటే రెట్టింపు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పత్తిసాగు కిందటి ఏడాది 60లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అయితే పత్తికి మార్కెట్‌లో క్వింటాలుకు రూ.5వేలకు మించి ధరలభించలేదు. అధిక వర్షాలు వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడులు కూడా అంతంతమాత్రంగానే లభించాయి.

దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పత్తిమార్కెట్ తీరు తెన్నులను అధ్యయనం చేయించిన ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ సంవత్సరం రాష్ట్రంలో పత్తిసాగును ప్రోత్సహించారు. సీజన్‌కు ముందుగానే పత్తి విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. నకిలీపత్తి విత్తనాలతో రైతులు మోసపోకుండా అధికారయత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడిక్కడ నిఘా పెట్టించారు. జిల్లాల వారీగా టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేయించి నకిలీ నాసిరకం విత్తానాలుమార్కెట్‌లోకి రాకుండా కట్టడి చేయించారు. ఎక్కడికక్కడ దాడుల ద్వార నకీలను ఏరి వేయించారు. పిడి చట్టాలను ప్రయోగించి అక్రమ వ్యాపారుల గుండెళ్లో రైళ్లు పరుగెట్టించారు. ఈ చర్యలతో ఏప్రిల్, మేలోనే వచ్చే సీజన్‌కు రాష్ట్రంలో పత్తిపంట సాగు విస్తీర్ణం 70లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వస్తుందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు వేసింది. అయితే తీరా సీజన్ ముగిసేసరికి రాష్ట్రంలో పత్తిసాగు 46లక్షల ఎకరాలకే పరిమితం అయింది. ప్రభుత్వం ఒకటి తలిస్తే రైతులు మరోకవిధంగా స్పందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News