Friday, December 27, 2024

కేంద్రం పెట్టిన పత్తి చిచ్చు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అడ్డగోలు విధానాలతో కేంద్ర ప్రభుత్వం పత్తిరైతుల పొట్టగొడుతోంది.  పత్తి ధరలను తొక్కిపెట్టి పరోక్షంగా వ్యాపారులకు ప్రధాని నరేంద్రమోడి సర్కారు మద్దతు నిస్తోందంటూ జాతీయ స్థాయిలో రైతులు, రైతు చి నిరశన సెగలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఏడాది పత్తి మార్కెట్ క్రయ విక్రయాల సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పత్తి ధరలు రూ.9వేలు పైగానే పలికాయి. నెల రోజు లు కూడా తిరక్కముందు ప్రైవేటు వ్యా పారులు కూడబలుక్కున్నట్టుగా పత్తి రెల్కుట్ పెరగకుండా ధరలు తొక్కిపట్టారు. ఇదే గత ఏడాది పత్తి విక్రయాలు క్విం టాల్ రూ.13వేల వరకు జరిగాయి. అ యితే దేశవ్యాప్తంగా వస్త్ర దు స్తుల ధరలు గత ఏడాది ధరల కంటే అధికంగానే ఉన్నాయి. మార్కెట్లో పత్తి ధరలు మాత్రం గతేడాది కంటే తగ్గుముఖం ప ట్టాయి. ఈ లాజిక్ కేంద్రప్రభుత్వంలో ఉ న్న పెద్దలకు తెలిసినంతగా రైతులకు తెలియకపోవటంతో పడిపోతున్న పత్తి ధర లు చూసి బిక్కమొఖం వేస్తున్నారు. ప్ర పంచంలోనే పత్తి పంట సాగుతో ఉత్పత్తుల్లో కూడా మన ప్రథమ స్థా నంలో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా పత్తి సాగు 333లక్షల హెక్టార్లలో జరిగితే ,ఒక్క మన అందులో 36శాతం విస్తీర్ణంలో పత్తి సాగు జరుగుతోంది. ఈ ఏడాది కూడా దేశంలో 120లక్షల హెక్టార్లలో పత్తిపంట సాగు జరిగిం ది. దేశంలో జరిగిన పత్తిసాగులో 67శాతం విస్తీర్ణం వరుణుడినే నమ్ముకుని వర్షాధారం కింద ఈ పంట సాగు చేశారు. కేవలం 33శాతంలోనే నీటిపారుదల కింద ఈ పంట సాగు జరిగింది. పత్తిసాగులో గుజరాత్ , మహారా ష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలే మొదటి మూడు స్థానాల్లో ఉన్నా యి. ఈ రాష్ట్రాల్లోనే 60శాతం పంట సాగులో ఉంది. పం ట దిగుబడి అంచనాల్లో కూడ గుజరాత్‌లో 90లక్షల బే ళ్లు, మహారాష్ట్రలో 84లక్షల బేళ్లు కాగా, ఈ రెండు రాష్ట్రాలతో పోటీ పడుతూ తెలంగాణ రాష్ట్రలో కూడా 51లక్షలబేళ్లకు పైగా పంట దిగుబడిని అంచాన వేశారు. అయితే ఈ ఏడాది అధిక వర్షాలతో పంటదెబ్బతింది. చీడపీడల బెడద కూడా అధికంగానే ఉంది.

ఈ ప్రభావం పత్తిదిగుబడులపై పడింది. ఎకరానికి 12క్వింటాళ్లకు పైగా పత్తి దిగుడి ఆశించిన రైతుకు తీరా పంట కోత చూస్తే ఏడెనిమిది క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. ఒక వైపు ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డిపత్తి సాగు చేస్తున్న రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వ విధానాలు పత్తిరైతుల పొట్టగొట్టేలా ఉన్నాయంటున్నారు. అంతర్జాతీయంగా మనదేశ పత్తికి మంచి డిమాండ్ ఉంది. నాణ్యతా పరంగా తెలంగాణ ప్రాంతం లో సాగు చేసిన పత్తి అంతర్జాతీ మార్కెట్‌లో హాట్‌కేకుల్లా అమ్మడువుతుంది. ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పత్తి ఎగుమతి విధానాల్లో సరైన నిర్ణయాలు తీసుకోని విధంగా ఎగుమతులు సన్నగిల్లుగుతున్నాయి. పత్తి మద్దతు ధరలు క్వింటాలు రూ.15000 ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

విత్తనాల నుంచి రసాయనిక ఎరువులు , క్రిమిసంహారక మందులు , కూలీ రేట్ల దాక పత్తిసాగు ఖర్చులు అనూహ్యరీతిలో పెరిగిపోయాయి. పత్తిపంట మార్కెట్‌ను గుప్పిట్లో పెట్టుకున్న కేం ద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధరలు మాత్రం పెరిగిన ఖ ర్చులకు తగ్గట్టుగా పెంచలేదు. పత్తికి సిఏసిపి సంస్థ రూ. 5వేల కూడా క్వింటాలకు ఉత్పత్తి ఖర్చును లెక్కవేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల అంచనా ప్రకారం పత్తిసాగులో క్వింటాలు ఉత్పత్తి ఖర్చు రూ. 9 వేల పైనే ఉంది. సిఏసిపి ఖర్చుల అంచనా ప్రకారమే రై తులకు కనీస మద్దతు ధరలు ప్రకటింస్తుండటం వల్ల పత్తిరైతులు తీవ్రంగా నష్టపోవాల్సివస్తోంది.కేంద్ర ప్రభు త్వం కాటన్ కార్పోరేషన్‌లో అంతా ఉత్తరాది వారితోనే నింపేస్తోందన్న విమర్శలు గత కొంతకాలంగా పెరుతున్నాయి.

సిసిఐ చైర్మన్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ మొదలుకుని, ఎండి రాజ్‌బిర్‌సింగ్ పన్వర్‌తోపాటు ఇత ర స భ్యులు, డైరెక్టర్లు కూడా ఉత్తారాది చెందిన వారే అధికం గా ఉన్నారని పైగా అందులో వ్యవసాయ అనుభవం ఉ న్నవారు లేకపోవటం వల్లే పత్తిరైతులకు న్యాయం జరగటం లే దన్న అభిప్రాయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభు త్వం నియమించిన మద్దతు ధరల సెల్‌లో కూడా అంతా వారిపెత్తనమే కొనసాగుతోందంటున్నారు.జౌళిశాఖ క మిషనర్ రూప్‌రాషి మొదలుకుని చైర్మన్ విజయ్ కు ర్దిగి, చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ కె పనగరియా, జిఎం విశాల్ కృష్ణ సిన్హాతోపాటు సలహాదారులు కూడా అక్కడి వారే అన్న వి మర్శలు వస్తున్నాయి. ఎమ్మస్పీ సెల్‌లో కూ డా వ్యవసా య అనుభవం, అవగాహణ లేని వారే ఉండ టం వల్ల త మకీ కష్టాలు తప్పటం లేదని పత్తిరైతులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News