Thursday, November 21, 2024

పత్తి రైతు చిత్తు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్ కార్పొరేషన్/భైంసా/ఖమ్మంబ్యూరో:రాష్ట్రంలో పత్తి రైతు చిత్తవుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాక ఆగమవుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక లబోదిబోమంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప త్తి పండించిన రైతులు ఆవేదనలో ఉన్నారు. సి సిఐ వైఖరికి నిరసనగా కాటన్ ట్రెడర్లు, మిల్ల ర్లు ఆకస్మికంగా సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యా ప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు స్తంభించాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశా రు. ఇప్పటి వరకు సాఫీగా సాగిన కొనుగోళ్లు సోమవారం పత్తిని కొనుగోలు చేసేది లే దం టూ జిన్నింగ్‌లను బంద్ పెట్టారు. ఉద యం 6గంటల నుంచే వందలాది మంది రైతు లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు భారీ గా పత్తిని తీసుకువచ్చారు.కొనుగోళ్లు ఆపేయడంతో పత్తి మార్కెట్‌లో రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. పత్తిలో తేమ పేరుతో సీసీ ఐ మెలికపెట్టడంతో రైతులు ఆందోళన చెందుతన్నారు.

ముందస్తు సమాచారంఇవ్వకుండా పత్తి కొనుగోళ్లు నిలివేయడంపై ఆగ్ర హం వ్య క్తం చేసిన రైతులు భైంసా-నిర్మల్ నేషనల్ హై వేపై రాస్తారోకో నిర్వహించారు. పత్తి రైతు ల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడిం ది. ఖచ్చితంగా పత్తి కొనుగోళ్లు జరపాలని రై తులు డి మాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వారిపై ఎస్మా కింద చర్యలు తీసుకోవాలన్నారు. అయినా అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కొనుగోళ్లు ఆపేశారు. పత్తిలో తేమ పేరుతో సీసీఐ మెలికపెడుతున్నదని, తక్కువ ధరకు కొంటానని అంటున్నదని రైతులు వాపోయారు. పంటల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడకుండా చూడాలన్న ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మార్కెట్ కమిటీ అధికారులను పిలిపించి మాట్లాడారు. మార్కెటింగ్ డిఎం శ్రీనివాస్ రైతులకు నచ్చజెప్పి జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో మాట్లాడడంతో పత్తి కొనుగోళ్లు పునరుద్ధరించారు.

ఎనుమాముల మార్కెట్‌లో నిలిచిన పత్తి కొనుగోళ్లు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు సుమారు మూడు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సిసిఐ వైఖరికి నిరసనగా వ్యాపారులు పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో కొనుగోలుదారుల కోసం రైతులు, అధికారులు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌లో ఎలాంటి గొడవలు తలెత్తకుండా ముందస్తుగా పోలీసులను మోహరించిన అధికారులు వ్యాపారస్థులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు.

మంత్రి తుమ్మల చొరవ…సమ్మె విరమించిన కాటన్ ట్రేడర్లు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చొరవతో కాటన్ ట్రేడర్లు, మిల్లర్లు సమ్మె విరమించి పత్తి కొనుగోళ్ళను సోమవారం ప్రారంభించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) వైఖరికి నిరసనగా కాటన్ ట్రైడర్లు, మిల్లర్లు సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ళను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన మంత్రి తుమ్మల సోమవారం ఖమ్మంలో ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో అటు మార్కెటింగ్, ఇటు సిసిఐ అధికారులతో ఫోన్లో సంప్రదింపులు జరిపి యధావిధిగా పత్తి కొనుగోళ్ళు జరిగేలా చర్యలు తీసుకున్నారు. పత్తి కొనుగోళ్ళ విషయంలో సిసిఐ గతంలో , తేమ, బరువు విషయంలో విధించిన నిబంధనలు కఠినంగా ఉన్నాయని కాటన్ మిల్లర్లు, ట్రేడర్లు ఆరోపిస్తూ టెండర్లను బహిష్కరించారు. అయితే ఆనాడు మంత్రి తుమ్మల సిపిఐ అధికారులతో జరిపిన చర్చల్లో కఠిన నిబంధనలను సడలించామని హామీ ఇవ్వడంతో తిరిగి ట్రేడర్లంతా టెండర్లో పాల్గొన్నారు.

ఇప్పుడు సీజన్ ప్రారంభమై పత్తి కొనుగోళ్ళు మొదలయ్యాక మళ్ళీ సిసిఐ పాత నిబంధనల పేరుతో కఠినంగా వ్యవహరిస్తుండటంతో గత్యంతరం లేక రాష్ట్ర కాటన్ మిల్లర్లు, ట్రేడర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ కేంద్రాలతోపాటు మార్కెట్ యార్డుల్లో కోనుగోళ్ళను నిలిపివేయాలని నిర్ణయించారు. ఈవిషయంపై సంక్షేమ సంఘం నేతలు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోవడంతో సమ్మెకు దిగారు. ఒక దశలో మార్కెటింగ్ కార్యాలయానికి సిసిఐ అధికారులు రావాలని కోరినప్పటికీ వారు రాకపోవడంతో మార్కెట్ అధికారులే సిసిఐ కార్యాలయానికి వెళ్లి ట్రేడర్లు, మిల్లర్లతో చర్చలు జరిపారు. టెండర్ సమయంలో కుదిరిన రేటును యధావిధిగా తిరిగి చెల్లించేందుకు సిసిఐ అధికారులు అంగికరించడంతో కాటన్ ట్రేడర్లు, మిలర్లు యధావిధిగా కొనుగోళ్ళను ప్రారంభించినట్లు కాటన్ మిల్లర్లు, ట్రేడర్ల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బొమ్మినేని రవీందర్ రెడ్డి, కక్కిరాల రమేశ్ తెలిపారు. చర్చలు ఫలించడంతో సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యధావిదిగా పత్తి కొనుగోళ్ళు ప్రారంభమయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విలేఖర్లకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News