Wednesday, November 6, 2024

పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

అధిక మద్ధతు ధర
కోసం సీసీఐ
సెంటర్లలోనే
విక్రయించాలి
ఇప్పటి వరకు
82.44 కోట్ల విలువైన 11,255 టన్నుల పత్తి
కొనుగోలు నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు
పనిచేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మన తెలంగాణ /హైదరాబాద్ : పత్తి రైతులకు భారం కాకుండా పత్తి కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని మార్కెటింగ్ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్‌కుమార్‌తో మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 82.44 కోట్ల రూపాయ ల విలువైన 11,255 టన్నుల పత్తిని 5,251 మంది రైతుల నుండి కొ నుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

గత సంవత్సరంలో ఇదే సమయానికి కేవలం రూ.3.91 కోట్లతో 560.37 టన్నుల పత్తిని 233 మంది రైతులనుండి మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమయానికి సీసీఐ ఇంతకుముందెన్నడు లేనంతగా ఎక్కువ పత్తిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో రైతులంతా పత్తిని ఆరబెట్టుకుని సీసీఐ నిబంధనలను అనుసరించి తేమ శాతం 8 నుండి 12 శాతం ఉండేలా చూసుకుని అధిక మద్దతు పొం దాలని సూచించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రతి ఒక్క జిన్నింగ్ మిల్లులు పూర్తి స్థాయి సిబ్బందితో పనిచేయాలని, రైతులకు వీలుగా ఉండేటట్లు ప్రతి ఒక్క జిన్నింగ్ మిల్లులో ఎంత సమయం వేచిఉండాలో తెలుసుకునేలా యాప్‌ను రూపొందించారన్నారు.

ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో రైతులు ఉపయోగించుకుని రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సులభంగా వారి పత్తిని అధిక మద్ధతు ధర కోసం సీసీఐ సెంటర్లలోనే విక్రయించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు , మార్కెటింగ్ అధికారులు విధిగా పర్యవేక్షించాలని, వాట్సాప్ యాప్ (8897281111) ద్వారా వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును మార్కెటింగ్ శాఖ సంచాలకులు పరిశీలించి, తిరిగి ఫోన్ ద్వారా రైతుల ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటివరకు 188 ఫిర్యాదులను స్వీకరించగా, 157 ఫిర్యాదులను పరిష్కరించినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News