Monday, January 20, 2025

మత మార్పిడి వ్యతిరేక బిల్లు ఆమోదం

- Advertisement -
- Advertisement -

Council passes anti-conversion Bill

బెంగళూరు: విపక్ష కాంగ్రెస్ ఆందోళన, వాకౌట్ నడుమ కర్ణాటక అసెంబ్లీ బుధవారం మత మార్పిడి వ్యతిరేక బిల్లును ఆమోదించింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించిన ఈ బిల్లును చిన్నపాటి సవరణలతో శాసన సభ ఆమోదించింది. ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును చేశారు. గతేడాది డిసెంబర్‌లో స్వేచ్ఛహక్కు పరిరక్షణ బిల్లును అసెంబ్లీ పాస్ చేసింది. అనంతరం ఈ బిల్లు కౌన్సిల్‌లో పెండింగ్‌లో ఉండిపోయింది. కౌన్సిల్‌లో అధికార బిజెపికి మెజార్టీ సభ్యులు లేకపోవడంతో బిల్లు ఆమోదం పొందకుండా నిలిచిపోయింది. ఈక్రమంలో ప్రభుత్వం ఈ ఏడాది మేలో ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దీంతో ఈ బిల్లును ఎట్టకేలకు కౌన్సిల్ సెప్టెంబర్ 15న ఈ నేపథ్యంలో కర్ణాటక హోం మంత్రి జ్ఙానేంద్ర బిల్లును సభలో ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఆమోదం పొందింది. కాగా ఈ చట్టం ఆర్డినెన్స్ జారీ చేసిన తేదీ 17 మే 2022 నుంచి అమల్లోకి వచ్చినట్లు పరిగణించనున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ యుటి ఖాదిర్ మాట్లాడుతూ బలవంతంగా మతమార్పిడిన ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారన్నారు. అయితే రాజకీయ దురుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లు అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయనున్నామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News