Wednesday, April 2, 2025

కోరుట్లలో కౌన్సిలర్ భర్తపై కత్తులతో దుండగులు దాడి..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కౌన్సిలర్ భర్తపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటన జిల్లాలోని కోరుట్లలో జరిగింది. మంగళవారం ఉదయం హోటల్ లో ఉన్న కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజ్యంపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కౌన్సిలర్ భర్తను స్థానికులు చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం కౌన్సిలర్ భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి పరారిలో ఉన్న దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News